ఎన్‌బీకేఆర్ ఐఎస్టీలో జపాన్ బృందం పర్యటన
కోట:విద్యానగర్ ఎన్‌బీకేఆర్ ఐఎస్టీలో బుధవారం జపాన్‌కు చెందిన మెడిన్‌షా కార్పోరేషన్ కంపెనీ ప్రతినిధుల బృందం పర్యటించింది. ఎన్‌బీకేఆర్ ఐఎస్టీకి 2018 నుంచి మెడిన్‌షా కంపెనీతో నైపుణ్య బదలాయింపుపై ఒప్పందం ఉంది. ఈ క్రమంలో కంపెనీ ప్రతినిధులు విచ్చేశారు. కళాశాల డైరెక్టర్ విజయకుమార్‌రెడ్డి వారికి సాదరంగా స్వాగతం పలికారు. ఎన్‌బీకేఆర్ ఐఎస్టీకి వారు అందిస్తున్న స్కిల్ ట్రాన్స్‌ఫర్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ సందర్భంగా కంపెనీ ఎండీ వకూయి మాట్లాడుతూ జపాన్ సాయంతో బుల్లెట్ ట్రైయిన్ అహ్మదాబాద్ టూ ఢిల్లీ ఏర్పాటు కానున్న క్రమంలో అందులో తమ కంపెనీ భాగస్వామ్యం కూడా ఉందన్నారు. రానున్న పది సంవత్సరాల్లో తమ కంపెనీ ద్వారా అనేక మందికి ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఎన్‌బీకేఆర్ ఐఎస్టీలో ఈ ఏడాది మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థులకు శిక్షణ ఇచ్చి, ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ విజయకుమార్‌రెడ్డి, ప్లేస్‌మెంట్ ఆఫీసర్ కిషంధర్ పాల్గొన్నారు.
మహిళా వర్సిటీలో ఐఎస్‌ఓ బృందం
తిరుపతి సిటీ: పద్మావతి మహిళా వర్సిటీలో ఐఎస్‌ఓ బృందం బుధవారం పర్యటించింది. రెండు రోజుల పాటు జరగనున్న ఈ పర్యటనలో తొలిరోజు బుధవారం వర్సిటీలో పలు విభాగాలలో సుడిగాలి పర్యటన చేశారు. ప్రధానంగా వర్సిటీలో ఆధునాతన సౌకర్యాలు, నాణ్యతా ప్రమాణాలు, అకడమిక్ విద్య, సామాజిక సేవా కార్యక్రమాలపై ఆరా తీశారు. పలు విభాగాలలో ఏర్పాటు చేసిన ల్యాబ్‌లను, విద్యాప్రమాణాలను, రికార్డులను పరిశీలించారు. గురువారం వర్సిటీ అధికారులతో సమావేశమై పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించి ఐఎస్‌ఓ సర్టిఫికేషన్‌ను అందించే అవకాశం ఉంది.
గాలీవాన బీభత్సం
కలువాయి(సైదాపురం): కలువాయి మండలంలో పలు గ్రామాల్లో బుధవారం గాలీవాన బీభత్సం సృష్టించింది. గాలీవానకు తెలుగురాయపురం నుంచి కోటితీర్థం గ్రామానికి వెళ్లే దారిలో తాటిచెట్లు రోడ్డుకు అడ్డంగా పడిపోయాయి. దీంతో ఈ మార్గంలో పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి.
ఎన్‌బీకేఆర్ ఐఎస్టీలో జపాన్ బృందం పర్యటన


