రీ–వెరిఫికేషన్‌లో టెన్త్‌ విద్యార్థినికి జీరో మార్కులు..! | Zero Marks After Reverification? Nandyal Student Raises Serious Questions Over SSC Evaluation | Sakshi
Sakshi News home page

రీ–వెరిఫికేషన్‌లో టెన్త్‌ విద్యార్థినికి జీరో మార్కులు..!

May 23 2026 11:04 AM | Updated on May 23 2026 3:07 PM

Zero Marks Shock in SSC Re-Verification

నంద్యాల జిల్లా: టెన్త్‌ పరీక్షల్లో తమ పిల్లలకు మార్కులు తక్కువ వచ్చాయని తల్లిదండ్రులు సబ్జెక్టుకు రూ.వెయ్యి చెల్లించి రీ–వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకున్నా ప్రయోజనం లేకపోతోంది. నంద్యాల జిల్లా జూపాడు బంగ్లాకు చెందిన సాహెబ్‌హుసేన్‌ కుమార్తె సుహానకు కెమిస్ట్రీ పరీక్షలో 50/50 మార్కులు, ఫిజిక్స్‌లో 31/50 మార్కులు వచ్చాయి. 

మార్కులు తక్కువ రావటంతో రీ–వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకుంది. ఎస్‌ఎస్‌సీ బోర్డు అధికారులు సుహాన రాసిన ఫిజిక్స్‌ పేపర్‌ను రీ–వెరిఫికేషన్‌ చేయకుండా జవాబు పత్రాన్ని స్కాన్‌ చేసి పంపించారు. నిబంధనలకు విరుద్ధంగా సున్నా మార్కులు వేశారు. చాలా ప్రశ్నలకు జవాబు రాసినా సున్నా మార్కులు వేశారని విద్యార్థిని వాపోయింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement