ఫోన్‌ మాట్లాడొద్దన్నందుకు యువతి ఆత్మహత్య | young woman ends life in hyderabad | Sakshi
Sakshi News home page

ఫోన్‌ మాట్లాడొద్దన్నందుకు యువతి ఆత్మహత్య

Jun 10 2025 10:06 AM | Updated on Jun 10 2025 10:06 AM

young woman ends life in hyderabad

కుత్బుల్లాపూర్‌(హైదరాబాద్): మొబైల్‌ ఫోన్‌ ఎక్కువగా మాట్లాడొద్దని తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురైన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పేట్‌బషిరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది.. ఏఎస్‌ఐ శ్రీనివాస్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. సుభాష్‌ నగర్‌ లాస్ట్‌ బస్టాప్‌ ప్రాంతానికి చెందిన రాజేష్‌ కుమార్‌ కుమార్తె తేజస్విని(19) గౌతమి కళాశాలో ఇంటర్‌ పూర్తి చేసింది. కాగా ఈ నెల 8వ తేది రాత్రి 11 గంటల ప్రాంతంలో యువతి ఫోన్‌లో మాట్లాడుతుండగా తల్లిదండ్రులు మందలించారు.

 సోమవారం ఉదయం తల్లిదండ్రులిద్దరూ డ్యూటీకి వెళ్లగా..ఉదయం 11.30 గంటల సమయంలో ఇంటర్నెట్‌ టెక్నీషియన్‌ ఇంటికి వచ్చి రాజేష్‌కుమార్‌ మొబైల్‌కు ఫోన్‌చేశాడు. అతను వెంటనే కుమార్తెకు ఫోన్‌ చేశాడు. ఆమె ఎంతకీ లేపకపోవడంతో పక్కింట్లో ఉండే లక్ష్మికి కాల్‌ చేసి చూడమని చెప్పాడు. 

దీంతో లక్ష్మి వెళ్లి చూడగా తేజస్విని చున్నీతో సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరివేసుకుని వేలాడుతూ కనిపించింది. వెంటనే చుట్టుపక్కల వారి సహాయంతో ఆమెను కిందకు దించి ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందిందని వైద్యులు ధ్రువీకరించారు. మృతురాలి తండ్రి ఇచి్చన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement