రక్తదానంతో ప్రాణదానం | World Blood Donor Day 2025 | Sakshi
Sakshi News home page

రక్తదానంతో ప్రాణదానం

Jun 14 2025 11:03 AM | Updated on Jun 14 2025 11:12 AM

World Blood Donor Day 2025

హైదరాబాద్‌: రక్తదానం ప్రాణదానంతో సమానమని మెరీడియన్‌ విద్యాసంస్థల సీఈవో బుట్టా తేజస్వి అన్నారు. శనివారం ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా మాదాపూర్‌లోని మెరీడియన్‌ స్కూల్‌లో మెగా రక్త దాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో ఉపాధ్యాయులతో పాటు, సిబ్బంది, పాఠశాల ఉద్యోగులు రక్తదానం చేశారు. 

అనంతరం స్కూల్‌ ప్రిన్సిపాల్‌ కరణం భవానీ మాట్లాడుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఎంతో మంది రక్తం లేక చనిపోతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయని అందువల్ల ప్రతి ఒక్కరు విధిగా తమ రక్తదాన్ని బ్లడ్‌ బ్యాంకుల్లో దానం చేయాలని దీని వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండవని అన్నారు. ఈ సందర్భంగా పాఠశాలలోని 80 మందికి పైగా ఉపాధ్యాయులు, ఉద్యోగులు రక్తదానం చేసినట్లు ప్రిన్సిపాల్‌ తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement