
రక్తదాతను అభినందిస్తున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
రాజ్‌భవన్‌లో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన జిష్ణుదేవ్ వర్మ
సాక్షి, హైదరాబాద్: నిస్వార్థ సేవనే ప్రజల జీవి తాన్ని కాపాడుతుందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని పురస్క రించుకుని శనివారం రాజ్‌భవన్‌లో రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని గవర్నర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ రక్తదానం చేయడం సేవగా గుర్తించాల న్నారు. రక్తదానం చేసిన వారికి కృతజ్ఞతలు తెలి పారు. అత్యవసర సమయాల్లో రక్తం కావాల్సిన వారికి ఈ దాతలు ఇచ్చిన రక్తం ఎంతో ఉపయోగ పడుతుందని వ్యాఖ్యానించారు.
స్వచ్ఛంద రక్త దానం చేసే వారిని, వారిని మోటివేట్ చేసిన వారిని గవర్నర్ అభినందించారు. డాక్టర్లు, రెడ్‌క్రాస్ వలంటీర్లు రక్తాన్ని సురక్షితంగా తీసుకోవడమేకాక, భద్రపరచడాన్ని ప్రశంసించారు. ఈ రక్తదానంలో రాజ్‌భవన్ ఉద్యోగులు, సెక్యూరిటీ సిబ్బంది పాలు పంచుకోవడం సంతోషకరమని వ్యాఖ్యానించారు. రక్తదానం చేసిన వారికి, ఎన్జీవో సంఘాలకు సర్టిఫికె ట్‌లను ప్రదానం చేశారు. కార్యక్రమంలో గవర్నర్ ముఖ్యకార్యదర్శి దాన కిశోర్, సంయుక్త కార్యదర్శి భవానీ శంకర్, సీనియర్ అధికారులు పాల్గొన్నారు.