దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో శనివారం 217వ కోర్సు కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ నిర్వహించారు. మొత్తం 231 మంది ఫ్లైట్ క్యాడెట్లు (194 మంది పురుషులు, 37 మంది మహిళలు) భారత వైమానిక దళంలో అధికారులుగా నియమితులయ్యారు.

పరేడ్ సందర్భంగా వైమానిక దళాధిపతి ఏపీసింగ్ నేతృత్వంలో జరిగిన ఫ్లైపాస్ట్ ఆహూతులను ఆకట్టుకుంది. పిలాటస్ పీసీ–7 ఎంఎక్–2, హాక్, కిరణ్, చేతక్ శిక్షణ విమానాలు ఆకాశంలో అద్భుత విన్యాసాలు ప్రదర్శించాయి. ‘ఆకాశ్ గంగ’ స్కైడైవింగ్ బృందం, ‘శక్తి’ ఉమెన్ ఎయిర్ వారియర్ డ్రిల్ టీమ్, సుఖోయ్–30 ఎంకేఐ యుద్ధ విమానాల విన్యాసాలు ఆకట్టుకున్నాయి.


