breaking news
parede ground
-
'రిపబ్లిక్ డే' పరేడ్‌లో ప్రధాన ఆకర్షణగా ఏఐ శకటం!
'ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వశాఖకు సంబంధించిన ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) శకటాన్ని ప్రత్యేక ఆకర్షణగా చెప్పవచ్చు. కృత్రిమ మేధ(ఏఐ)లో మన దేశం సాధించిన పురోగతికి అద్దం పట్టేల, హెల్త్‌కేర్, లాజిస్టిక్స్, విద్య, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫాక్చరింగ్‌పై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావాన్ని ప్రతిఫలించేలా ఈ శకటాన్ని తీర్చిదిద్దారు.' శకటంలో ఒక మహిళా రోబోట్ కృత్రిమ మేధస్సును ప్రతిబింబించేలా ఉంటుంది. వివిధ ఎలక్ట్రానిక్ పరికరాల్లో కీలకమైన సెమీకండక్టర్ చిప్ 3డీ మోడల్‌ను శకటంలోఏర్పాటు చేశారు. వివిధ రంగాల్లో భారతదేశ అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్లడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగాన్ని తెలియజేసేలా శకటానికి ఇరువైపులా ఎల్ఈడీ లైట్లతో అలంకరించిన సర్క్యూట్ డిజైన్ ఆకట్టుకుంటుంది. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్(పీఎల్ఐ) లాంటి కార్యక్రమాల ద్వారా ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్లో మన దేశం సాధించిన పురోగతిని కూడా ఈ శకటం హైలెట్ చేస్తుంది. శకటం మధ్య విభాగంలో లాజిస్టిక్స్‌పై దృష్టి పెట్టారు. కలర్ కోడింగ్ ఆధారంగా పార్శిల్ గుర్తింపు, విభజనకు సాంకేతికత ఎలా సహాయపడుతుందో తెలియజేసేలా ఉంటుంది. శకటం వెనుక భాగం విద్యారంగంపై దృష్టిని మళ్లిస్తుంది. వీఆర్ హెడ్సెట్ ధరించి వర్చువల్ రియాలిటీ ద్వారా రిమోట్ క్లాసును నిర్వహించే ఉపాధ్యాయుడి లార్జర్ దెన్ లైఫ్ స్టాచ్యూ ఉత్తేజకరంగా ఉంటుంది. పశువుల ఆరోగ్యాన్ని పర్యవేక్షించడంలో సెన్సర్ల ద్వారా ఏఐ అప్లికేషన్ల ఉపయోగం, నావిగేషన్‌కు సంబంధించి దృష్టి లోపం ఉన్న వ్యక్తులకు సహాయపడే విషయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారాన్ని ఈ ఏఐ శకటం హైలెట్ చేస్తుంది. ఇవి చదవండి: జనవరి 26నే 'రిపబ్లిక్ డే' ఎందుకో తెలుసా! -
పరేడ్ గ్రౌండ్స్ లో జాతీయ జెండా ఆవిష్కరించిన అమిత్ షా
-
తెలుగులో ప్రసంగం ప్రారంభించిన ప్రధాని మోదీ
-
ఎక్కడికక్కడ అప్రమత్తం .. భద్రత కట్టుదిట్టం
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇతర కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా కీలక నేతలు హైదరాబాద్‌లో జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరుకానున్న నేపథ్యంలో.. భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. సమావేశాలు జరిగే మాదాపూర్‌లోని హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్(హెచ్ఐసీసీ)తోపాటు నోవాటెల్, రాజ్‌భవన్, బేగంపేట.. మోదీసభ జరిగే పరేడ్ గ్రౌండ్స్ పరిసర ప్రాంతాల్లో పెద్దయెత్తున భద్రతాబలగాలు మోహరిస్తున్నాయి. స్పెష ల్ ప్రొటెక్షన్ గ్రూప్(ఎస్పీజీ), కేంద్ర బలగాలతో కలిసి నాలుగంచెల భద్రత ఏర్పాట్లు చేశారు. మొత్తం 15 వేల మంది భద్రత, బందోబస్తు విధుల్లో పాల్గొంటున్నారు. ఎస్పీజీ, ఎన్ఎస్జీ, ఆక్టోపస్, శాంతిభద్రతల విభాగంతో పాటు టాస్క్‌ఫోర్స్, సిటీ సెక్యూరిటీ వింగ్, సీఏఆర్ విభాగాలు రంగంలోకి దిగుతున్నాయి. నగరవ్యాప్తంగా నిఘా, తనిఖీతోపాటు భారీగా మఫ్టీ పోలీసులను ఏర్పాటు చేశారు. ప్రధాని తిరిగే మార్గాల్లో రూట్పార్టీలు ఉంటాయి. దుర్భేద్యంగా హెచ్ఐసీసీ జాగిలాలతో హెచ్ఐసీసీ, నోవాటెల్ ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. ఎత్తైన భవనాల పైనుంచి రూఫ్‌టాప్ వాచ్ చేస్తున్నారు. పాస్ ఉన్న వాహనాలు, వ్యక్తులను మాత్రమే హెచ్ఐసీసీ లోపలికి అనుమతిస్తున్నారు. హైటెక్స్ లోపలికి వచ్చే ప్రతి ఒక్క వాహనాన్నీ విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. పాస్‌లేని పోలీస్ వాహనాలను సైతం తిప్పి పంపి స్తున్నారు. హెచ్ఐసీసీ వద్ద ఏర్పాటు చేసిన ఆర్టీపీసీఆర్ కేంద్రాలలో కరోనా పరీక్షలు నిర్వహించాకే లోపలికి అను మతి ఇస్తున్నారు. ఈ నెల 4వ తేదీ వరకు సైబరాబాద్ కమి షనరేట్ పరిధిలో 144 సెక్షన్ విధించారు. ఐదుగురి కంటే ఎక్కువమంది గుమిగూడితే అరెస్టు చేస్తామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర హెచ్చరించారు. శుక్రవా రం పరేడ్ గ్రౌండ్స్‌కు వెళ్లిన హైదరా బాద్ కొత్వాల్ సీవీ ఆనంద్ అధికారులతో బందోబస్తు, భద్రత ఏర్పాట్లు సమీక్షించారు. మరోపక్క బేగంపేట విమానాశ్రయం నుం చి పరేడ్ గ్రౌండ్స్‌కు, అక్కడ నుంచి రాజ్‌భవన్ వరకు సెక్యూరిటీ, కాన్వాయ్ రిహార్సల్స్ నిర్వహించారు. గ్రౌండ్స్ ను శనివారం ఎస్పీజీ అ«ధీనంలోకి తీసుకోనుంది. శుక్రవా రం నుంచే బేగంపేట విమానాశ్రయం, పరేడ్ గ్రౌండ్స్, బాంబు నిర్వీర్యబృందాలతో తనిఖీ చేస్తున్నారు. ముందస్తు అరెస్టులు.. ‘అగ్నిపథ్’కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మొదలైన నిరసనలు విధ్వంసానికి దారితీయడం, ప్రతిపక్షాలు మద్దతు ఇవ్వటంతో ప్రధాని పర్యటన నేపథ్యంలో అకస్మాత్తుగా ఆందోళనలు చేపట్టే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎమ్మార్పీఎస్ శనివారం సడక్‌బంద్‌కు పిలుపు ఇవ్వటంతో అవాంఛనీయ సంఘటనలు జరగ కుండా సైబరాబాద్ పోలీసులు ముందస్తు అరెస్ట్‌లు చేస్తున్నారు. నేరచరితులు, రౌడీషీటర్లకు బైండోవర్లు విధిం చా రు. శంషాబాద్ మున్సిపాలిటి పరిధిలో ఎమ్మార్పీఎస్ పార్టీ కన్వీనర్ రాచమల్ల రాజును పోలీసులు అరెస్టు చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు.. హెచ్ఐసీసీ, నోవాటెల్ హోటల్ పరిసర ప్రాంతాలలో శని, ఆదివారాల్లో పలు మార్గాలలో ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని పోలీసులు సూచించారు. జేఎన్టీయూ నుంచి సైబర్ టవర్స్, మియాపూర్ నుంచి కొత్తగూడ, కావూరి హిల్స్ నుంచి కొత్తగూడ, బయోడైవర్సిటీ నుంచి జేఎన్టీయూ, నారాయణమ్మ కాలేజ్ నుంచి గచ్చిబౌలి మార్గాలలో భారీ వాహనాలకు ప్రవేశం లేదు. ట్రాఫిక్ మళ్లింపు మార్గాలివే.. ►నీరూస్ జంక్షన్ నుంచి కొత్తగూడ జంక్షన్, గచ్చిబౌలి వైపు వచ్చే వాహనాలను దుర్గం చెరువు – ఇనార్బిట్ – ఐటీసీ కోహినూర్ – ఐకియా – బయోడైవర్సిటీ – గచ్చి బౌలి మీదుగా సీవోడీ జంక్షన్‌కు మళ్లిస్తారు. సైబర్ టవర్స్, హైటెక్స్ జంక్షన్ల మీదుగా ప్రవేశం లేదు. ►మియాపూర్, కొత్తగూడ, హఫీజ్‌పేట మీదుగా హైటెక్ సిటీ, సైబర్ టవర్స్, జూబ్లీహిల్స్ వైపు వచ్చే వాహనాలు రోలింగ్ హిల్స్ – ఏఐజీ హాస్పిటల్ – ఐకియా – ఇన్నార్బిట్ – దుర్గం చెరువు రోడ్ మీదుగా వెళ్లాలి. ►ఆర్సీపురం, చందానగర్ మీదుగా మాదాపూర్, గచ్చిబౌలి వైపునకు వచ్చే వాహనాలు బీహెచ్ఈఎల్ – నల్లగండ్ల – హెచ్‌సీయూ – ఐఐఐటీ – గచ్చిబౌలి రోడ్డు మీదుగా వెళ్లాలి. అల్విన్, కొండాపూర్ రోడ్లో వాహనాలకు ప్రవేశం లేదు. -
ఐదోరోజూ అదే ఉత్సాహం
మచిలీపట్నం : పోలీస్ కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు ఐదోరోజూ శుక్రవారం కూడా స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగాయి. అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షల ఎంపిక ప్రక్రియను ఎస్పీ జి.విజయకుమార్, మచిలీపట్నం డీఎస్పీ శ్రావణ్‌కుమార్ తదితరులు పర్యవేక్షించారు. తొలుత 1,600 మీటర్ల పరుగుపందెం అనంతరం లాంగ్‌జంప్, ఆ తరువాత 100 మీటర్ల పరుగుపందేన్ని విడతలవారీగా నిర్వహించారు. పరుగుపందెం పోటీల్లో అస్వస్థతకు గురైన వారికి ప్రత్యేక వైద్యశిబింలో వైద్యసేవలు అందించారు. పక్కాగా వివరాలు నమోదు పోలీస్ కానిస్టేబుల్ ఎంపికను పురస్కరించుకుని పరుగుపందెం పోటీలను సెన్సార్ ద్వారా నమోదు చేస్తున్నారు. చెన్నైకు చెందిన ఒలింపియాన్ టెక్ సంస్థకు పరుగుపందెం పోటీలను నమోదుచేసే పనిని అప్పగించారు. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీ ద్వారా అభ్యర్థుల పరుగుపందేన్ని నమోదు చేస్తున్నారు. ప్రతి అభ్యర్థికి ఒక నంబరు కేటాయిస్తున్నారు. ఆ నంబరు ఉన్న పచ్చరంగు జాకెట్‌ను అందజేస్తున్నారు. ఈ జాకెట్‌కు రెండు భుజాలపైనా ప్రత్యేక చిప్‌లను అమర్చారు. ఈ చిప్ ఆధారంగా అభ్యర్థి ఎంత సమయంలో పరుగుపందేన్ని పూర్తిచేశాడో సెకనుతో సహా సెన్సార్ సేకరించి ఆ వివరాలను కంప్యూటర్‌కు పంపుతుంది. దీని ఆధారంగా అభ్యర్థులు పరుగుపందెం పూర్తిచేసిన సమయాన్ని బట్టీ మార్కులను కేటాయిస్తున్నారు. సెన్సార్ నమోదులో ఏమైనా తేడాలు ఉంటే సీసీ కెమెరాల ద్వారా అభ్యర్థుల అనుమానాలను నివృత్తి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మొట్టమొదటిసారిగా రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీ ద్వారా పరుగుపందెం పోటీల నమోదు జరుగుతోందని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు.