భర్తతో గొడవ పడి భార్య ఆత్మహత్య  | Woman commits Suicide In Hyderabad | Sakshi
Sakshi News home page

భర్తతో గొడవ పడి భార్య ఆత్మహత్య 

Mar 30 2023 11:28 AM | Updated on Mar 30 2023 11:28 AM

Woman commits Suicide In Hyderabad  - Sakshi

శివకుమార్‌తో   రెండున్నరేళ్ల క్రితం వివాహం

షాబాద్‌: భర్తతో గొడవ పడి కూతురు ఆత్మహత్యకు పాల్పడగా.. మనస్తాపంతో ఆమె తల్లి బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన షాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ గురువయ్యగౌడ్‌ కథనం ప్రకారం.. మండల పరిధిలోని హైతాబాద్‌ గ్రామానికి చెందిన కుమ్మరి మల్లేశ్, యాదమ్మ దంపతులకు కుమారుడు గురుప్రసాద్, కూతురు సుమిత్ర సంతానం. ఏడేళ్ల క్రితం మల్లేశ్‌ మృతి చెందడంతో వీరి బాగోగులు తల్లి యాదమ్మ చూసుకునేది.

కూతురు సుమిత్రకు రుద్రారం గ్రామానికి చెందిన కుమ్మరి శివకుమార్‌తో   రెండున్నరేళ్ల క్రితం వివాహం జరిపించారు. దంపతుల మధ్య తరుచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో శివకుమార్‌  26న పురుగుల  మందు తాగి ఆత్మహత్యకు యతి్నంచాడు.  దీంతో తీవ్ర మనస్తాపం చెందిన సుమిత్ర (22) మంగళవారం రాత్రి హైతాబాద్‌లో తల్లిగారి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కూతురు మరణించిందని తల్లి యాదమ్మ(45) నీటి సంపులో దూకి    బలవన్మరణానికి పాల్పడింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement