కవిత ‘తెలంగాణ రక్షణ సేన’పై బీఆర్‌ఎస్‌ ఫిర్యాదు | Unexpected Hurdles for Kavitha Telangana Rakshana Sena | Sakshi
Sakshi News home page

కవిత ‘తెలంగాణ రక్షణ సేన’పై బీఆర్‌ఎస్‌ ఫిర్యాదు

Jun 11 2026 5:20 PM | Updated on Jun 11 2026 5:46 PM

Unexpected Hurdles for Kavitha Telangana Rakshana Sena

సాక్షి,హైదరాబాద్‌: ఎమ్మెల్సీ కవిత రాజకీయ పార్టీ ‘తెలంగాణ రక్షణ సేన’(TRS)కు ఊహించని అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఇప్పటికే కవిత పార్టీ టీఆర్‌ఎస్‌పై ఈసీఐకి దాదాపు 700 ఫిర్యాదులు అందడం రాజకీయ వర్గాల్లో చర్చాంశనీయంగా మారింది.

ఈ నేపథ్యంలో కవిత రాజకీయ పార్టీ పేరుపై భారత రాష్ట్ర సమితి (BRS) కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.14 ఏళ్ల తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ‘టీఆర్‌ఎస్‌’ అనే పేరు తెలంగాణ ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉందని, ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు బీఆర్ఎస్‌ను ‘టీఆర్ఎస్’గానే గుర్తిస్తున్నారని పేర్కొంటూ ఆ పేరును ఇతరులకు కేటాయించవద్దని ఈసీఐకి అధికారిక ఫిర్యాదు చేసింది.

కవిత పార్టీ ప్రకటనకు ముందే మహారాష్ట్రలోని సోలాపూర్ కేంద్రంగా పనిచేస్తున్న ‘తెలంగాణ రాష్ట్రసామాజిక సేన’ కూడా ‘టీఆర్ఎస్’ అనే పేరు తమ పార్టీకి కేటాయించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించినట్లు సమాచారం. సోలాపూర్‌కు చెందిన దయానంద్ మహాదేవ్ మామ్‌డ్యాల్ ఈ మేరకు కవిత పార్టీ ప్రకటనకు ఒక రోజు ముందే ఈసీఐకి దరఖాస్తు చేసినట్లు తెలుస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement