HYD: రేపు, ఎల్లుండి విద్యాసంస్థలు బంద్‌ | Two Days Schools Closed In Hyderabad For Elections | Sakshi
Sakshi News home page

HYD: రేపు, ఎల్లుండి విద్యాసంస్థలు బంద్‌

Nov 28 2023 12:58 PM | Updated on Nov 28 2023 1:02 PM

Two Days Schools Closed In Hyderabad For Elections - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన నవంబర్‌ 30న(గురవారం) పోలింగ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో రేపు(బుధవారం), ఎల్లుండి(గురువారం) అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. 

తెలంగాణ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో రేపు, ఎల్లుండి హైదరాబాద్ పరిధిలోని అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్‌ దురిశెట్టి. ఇక, మళ్లీ డిసెంబర్‌ ఒకటో తేదీన విద్యాసంస్థలు యథావిధిగా ప్రారంభం కానున్నాయి.  ఈ మేరకు ట్విట్టర్‌ వేదికగా సమాచారం ఇచ్చారు. 

Advertisement
 
Advertisement
Advertisement