సీఎం రేవంత్‌రెడ్డికి టోనీ బ్లెయిర్‌ లేఖ | Tony Blair letter to CM Revanth Reddy | Sakshi
Sakshi News home page

సీఎం రేవంత్‌రెడ్డికి టోనీ బ్లెయిర్‌ లేఖ

Jun 26 2025 2:52 AM | Updated on Jun 26 2025 2:52 AM

Tony Blair letter to CM Revanth Reddy

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రైజింగ్‌ విజన్‌–2047 డాక్యుమెంట్‌ తయారీ పట్ల సీఎం ఎ.రేవంత్‌రెడ్డిని బ్రిటన్‌ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌ ప్రశంసించారు. రేవంత్‌ విజన్‌ను ప్రశంసిస్తూ తాజాగా టోనీ బ్లెయిర్‌ ఆయనకు లేఖ రాశారు. ఇటీవల ఢిల్లీలో టోనీ బ్లెయిర్‌తో సమావేశమైన సీఎం రేవంత్‌.. ఆయనకు రైజింగ్‌ తెలంగాణ విజన్‌ ఉద్దేశాలను వివరించారు. విజన్‌లో భాగంగా 2024 నాటికి 3 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రాన్ని అభివృద్ధి­పరచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలియజేశారు. 

విజన్‌ రూపకల్పన, అమలుకి సహకారం అందించడం కోసం టోనీ బ్లెయిర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్లోబల్‌ చేంజ్‌ (టీబీఐజీసీ) సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకోనుంది. ఈ మేరకు ప్రభుత్వం, టీబీఐజీసీలు పరస్పర అవగాహన లేఖలు (లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌)ను మార్పిడి చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో రైజింగ్‌ తెలంగాణ విజన్‌ లక్ష్యాల సాధనకు టీబీఐజీసీ ప్రభుత్వానికి సహకరిస్తుందని టోనీ బ్లెయిర్‌ తెలిపారు. విజన్‌–2047 డాక్యుమెంట్‌ ఆవిష్కరణకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు పేర్కొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement