Hyderabad: ముగ్గురు యువతుల అదృశ్యం.. షాకింగ్‌ ఏంటంటే.. | Three Young Women Missing In Hyderabad | Sakshi
Sakshi News home page

ముగ్గురు యువతుల అదృశ్యం.. అదే కంపెనీలో పనిచేసే మరో ముగ్గురు..

Dec 19 2021 4:28 PM | Updated on Dec 19 2021 4:45 PM

Three Young Women Missing In Hyderabad - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌(మేడ్చల్‌): ఓ కంపెనీలో పని చేస్తున్న ముగ్గురు యువతులు అదృశ్యమైన ఘటన మేడ్చల్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం బుష్రబి జిలానిషేక్‌ (17), బిస్బిల్లాబి జిలాని షేక్‌ (16), అశ్మాబి అజీం (19) ముగ్గురు బిహార్‌ నుంచి వలస వచ్చి గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కండ్లకోయలో నివాసముంటున్నారు. దేవరయావంజాల్‌లోని ఓ బుక్‌ కంపెనీలో కార్మికురాలుగా పని చేస్తున్నారు.

కాగా ఎప్పటిలాగే ముగ్గురు శనివారం ఉదయం 8 గంటలకు కంపెనీకి వెళ్లారు. రాత్రి వరకు తిరిగి ఇంటికి రాలేదు. దీంతో వారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరితో పాటే అదే కంపెనీలో పని చేస్తున్న విష్ణు, నూతన్, విశ్వకర్మలు సైతం పనులను హాజరుకాకపోవడంతో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి.

చదవండి: (Hyderabad: వ్యభిచార గృహం గుట్టు రట్టు.. సోదరుడి ఇంట్లోనే..)

Advertisement
 
Advertisement
Advertisement