
మహబూబ్ నగర్: జిల్లాలోని టీడీ గుట్టవద్ద మరో చిరుత ప్రత్యక్షమైంది. ఇటీవల ఓ చిరుతను అధికారులు బంధించగా, ఇప్పుడు మరో చిరుతు కనిపించడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. అసలు ఎన్ని చిరుతలున్నాయనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
టీడీ గుట్టవద్ద తాజాగా కనిపించిన చిరుతను కెమెరాల్లో బంధించడంతో ఒక్కసారిగా అలజడి నెలకొంది. దీనిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. తమ ప్రాణాలు గాల్లో దీపంలా మారిపోయాయంటూ మండిపడుతున్నారు. మరొకవైపు చిరుతల సంచారపై ఓ అంచనాకు రాలేకపోతున్నారు ఫారెస్ట్ అధికారులు.