Telangana: కరోనా కేసులు @ 434  | Telangana Logs 434 new Covid 19 Cases | Sakshi
Sakshi News home page

Telangana: కరోనా కేసులు @ 434 

Jun 23 2022 1:56 AM | Updated on Jun 23 2022 9:47 AM

Telangana Logs 434 new Covid 19 Cases - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. మంగళవారం 26,704 మందికి కరోనా పరీక్షలు చేయగా, 403 మంది వైరస్‌ బారిన పడ్డారు. బుధవారం 27,754 మందికి పరీక్షలు చేయగా, 434 మందికి కరోనా నిర్ధారణయింది. వీరిలో అత్యధికంగా హైదరాబాద్‌లో 292, రంగారెడ్డి జిల్లాలో 71 మంది ఉన్నారని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు.

ఈ మేరకు ఆయన కరోనా బులిటెన్‌ విడుదల చేశారు. ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 7.97 లక్షలకు చేరుకుంది. ఒక్కరోజులో 129 మంది, ఇప్పటి వరకు 7.90 లక్షల మంది కోలుకున్నారు. ప్రస్తుతం 2,680 క్రియాశీలక కేసులు ఉన్నాయి.  

Advertisement
 
Advertisement
Advertisement