మాజీమంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు హైకోర్టులో చుక్కెదురు | Telangana HC Dismisses Srinivas Goud Petition Over Security | Sakshi
Sakshi News home page

మాజీమంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు హైకోర్టులో చుక్కెదురు

Mar 5 2024 1:37 PM | Updated on Mar 5 2024 1:40 PM

Telangana HC Dismisses Srinivas Goud Petition Over Security - Sakshi

(ఫైల్‌ ఫొటో)

సాక్షి, హైదరాబాద్‌:  మాజీమంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. తనకు ప్రాణ హాని ఉందని శ్రీనివాస్ గౌడ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. తనకు 4+4 గన్‌మెన్లను కేటాయించాలని పిటిషన్‌లో కోరారు. శ్రీనివాస్‌గౌడ్ వేసిన పిటిషన్‌ మంగళవారం హైకోర్టు విచారణ చేపట్టింది. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభ్యర్థునను హైకోర్టు నిరాకరించింది.

ప్రతి ఒక్కరికి ఈ విధంగా కేటాయించడం సాధ్యం కాదని హైకోర్టు పేర్కొంది. శ్రీనివాస్ గౌడ్‌కు  గన్‌మెన్లు అవసరమో? లేదో? తెలపాలని హైకోర్టు డీజీపీని ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేయాలనీ హైకోర్టు డీజీపీని ఆదేశించింది. తదుపరి విచారణను హైకోర్టు.. మార్చి 19కి వాయిదా వేసింది.

Advertisement
 
Advertisement
Advertisement