గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఆస్తి పన్ను చెల్లింపు.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం | Telangana Government Key Decisions On Property Tax In Hyderabad | Sakshi
Sakshi News home page

గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఆస్తి పన్ను చెల్లింపు.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

Mar 7 2025 7:48 PM | Updated on Mar 7 2025 9:00 PM

Telangana Government Key Decisions On Property Tax In Hyderabad

హైదరాబాద్‌, సాక్షి : హైదరాబాద్‌ నగర వాసులకు జీహెచ్‌ఎంసీ శుభవార్త చెప్పింది. ఆస్తి పన్ను చెల్లింపులో వడ్డీపై 90 శాతం డిస్కౌంట్‌ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే గతేడాది బకాయిదారులకు బల్దియా వన్‌ టైం సెటిల్‌మెంట్‌ అవకాశాన్ని కల్పిచ్చింది.

తాజాగా, మరోసారి ఆ అవకాశాన్ని కల్పిస్తూ పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి దాన కిషోర్‌ ఉత్తర్వులు జారీచేశారు. ఈ నెలాఖరు వరకు పెండింగ్ ప్రాపర్టీ ట్యాక్స్ కట్టేవారికి ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది.  

తద్వారా 2024-25 సంవత్సరానికి  కేవలం 10 శాతం వడ్డీతో బకాయిదారులంతా తమ ఆస్తిపన్నును చెల్లించే వెసులుబాటు కలుగుతుంది. అయితే,ఈ ఓటీఎస్ ద్వారా పెండింగ్‌లో ఉన్న ప్రాపర్టీ ట్యాక్స్ వసూలవుతుందని జీహెచ్ఎంసీ అధికారులు భావిస్తున్నారు.  సుమారు రెండు వేల కోట్ల ఆస్తి పన్ను లక్ష్యంగా తెలంగాణ సర్కారు ఈ ని  ర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement