తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయాలు | Telangana Cabinet Takes Several Key Decisions | Sakshi
Sakshi News home page

తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయాలు

Jul 2 2026 8:40 PM | Updated on Jul 2 2026 9:53 PM

Telangana Cabinet Takes Several Key Decisions

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వైద్య సంస్థల్లో ఖాళీల భర్తీకి ఆమోదం తెలిపింది. మార్క్‌ఫైడ్‌ ద్వారా ఎరువులు, విత్తనాల కొనుగోలుకు బ్యాంక్‌ రుణాలకు ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వాలని నిర్ణయించింది. నవోదయ, కేవీ సైనిక్‌ స్కూళ్లకు భూములు కేటాయింపు, పలు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నిర్మాణం కోసం భూములు కేటాయించాలని కేబినెట్ ఆమోదం తెలిపింది.

పాతబస్తీలో 8 చారిత్రక కామన్ల పునరుద్ధరణకు ఆమోదం తెలిపి కేబినెట్‌.. రూ.11.86 కోట్ల పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. విద్యార్థులతో పాటు టీచర్లకూ మధ్యాహ్న భోజనం.. అల్పాహారంతో పాటు మధ్యాహ్న భోజనం అందించాలని కేబినెట్‌ నిర్ణయించింది.

వీబీజీ రామ్‌జీ చట్టం అమలుకు ఆమోదం తెలిపిన రాష్ట్ర కేబినెట్.. కొత్త చట్టంపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించింది. ఉపాధి హామీ చట్టంపై కేంద్రానికి మరోసారి నిరసన తెలపాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. విద్యార్థులతో పాటు టీచర్లు, సిబ్బందికి భోజన పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. టీచర్లు, లెక్చరర్లు, సిబ్బందికి అల్పాహారం-పాలు-మధ్యాహ్న భోజనం అందించేందుకు ఆమోదం తెలిపింది.

టిమ్స్ ఆసుపత్రుల్లో 6,278 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపిన కేబినెట్.. టిమ్స్ ఆసుపత్రులను నిమ్స్ తరహాలో అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. మూసీ రివర్‌ఫ్రంట్ ఫేజ్-1 పనులకు రూ.7,345.12 కోట్లకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మూసీ రివర్‌ ఫ్రంట్ కోసం 147 కొత్త పోస్టుల సృష్టికి కేబినెట్ ఆమోదం తెలిపింది. టీజీఎస్‌డబ్ల్యూసీకి 60 ఎకరాల భూమి కేటాయింపు, జవహర్ నవోదయ విద్యాలయాలకు ప్రభుత్వ భూముల కేటాయింపు, జగిత్యాలలో కేంద్రీయ విద్యాలయానికి 5 ఎకరాల భూమి కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement