హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సెప్టెంబరు 7 నుంచి ప్రారంభం కానున్నాయి. శాసనసభ, శాసనమండలిని ఎన్ని రోజులు నిర్వహించాలనే విషయంపై తొలి రోజు సమావేశం తర్వాత జరిగే శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ (బీఏసీ) భేటీలో నిర్ణయిస్తారు. ఈ వర్షాకాల సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది.
ఇదీ చదవండి: ఒక్క పొరపాటు.. అపార్ట్‌మెంట్లు కూలిపోతాయని దడుసుకున్నారు..


