కొండా సురేఖ అంశంపై సీఎం రేవంత్‌ స్పందన ఇదే! | CM Revanth Press Meet: Will He Respond to Konda Surekha Daughter Remarks | Sakshi
Sakshi News home page

‘నా అమెరికా పర్యటన రద్దు.. తెలంగాణ ప్రజలకే అవమానం’

Aug 24 2026 2:58 PM | Updated on Aug 24 2026 6:05 PM

CM Revanth Press Meet: Will He Respond to Konda Surekha Daughter Remarks

సాక్షి,హైదరాబాద్: మంత్రి కొండా సురేఖ అంశంపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. ‘కొండా సురేఖ అంశం క్రమశిక్షణా కమిటీ పరిధిలో ఉంది. పార్టీ అంతర్గత అంశాలపై మీడియా ముఖంగా మాట్లాడను.తీసుకునే నిర్ణయాలకు మేము అందరం కట్టుబడి ఉన్నాం. ఆ నిర్ణయాన్ని అందరూ అంగీకరించాల్సిందే’ అని స్పష్టం చేశారు. అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించడంపై ఆయన సోమవారం తెలంగాణ సచివాలయంలో మీడియాతో మాట్లాడారు.

తెలంగాణ ముఖ్యమంత్రిగా నా విదేశీ పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడం సరైనది కాదు. ఈ వైఖరిని అందరూ తప్పుబడుతున్నారు. ‘వికసిత్ భారత్’ ప్రణాళికలో భాగంగానే మేము ‘తెలంగాణ రైజింగ్ 2047’ను ప్రకటించాం. ముఖ్యంగా విద్యా, క్రీడా రంగాలలో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ పర్యటనను తలపెట్టాం. లండన్ పర్యటనకు అనుమతి ఇచ్చిన కేంద్రం, అమెరికా వెళ్లేందుకు మాత్రం నిరాకరించింది.

అమెరికా పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలను సమర్పించలేదనే కారణంతోనే కేంద్రం అనుమతి నిరాకరించిందంటూ బీజేపీ నేతలు చేస్తున్న ప్రచారంలో నిజం లేదు. కొందరు బీజేపీ నేతలు కావాలనే కేంద్రాన్ని తప్పుదోవ పట్టించారు. నేను లండన్, అమెరికా పర్యటనల పూర్తి వివరాలను కేంద్ర ప్రభుత్వానికి ముందుగానే అందించా.

కేంద్రం కేవలం రాజకీయ కారణాలతోనే నా అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరించింది. నా పర్యటనను అడ్డుకోవడం అంటే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల్ని అవమానించడమే. కేంద్రం నిర్ణయాన్ని తెలంగాణ ప్రజలు ముక్తకంఠంతో ఖండించాలి. ఇది నాకు జరిగిన అవమానం కాదు.. తెలంగాణ జరిగిన అవమానం. 

తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపిస్తోంది. ఈ వివక్షను సహించేది లేదు. పార్లమెంట్‌లో ఈ అంశాన్ని ప్రస్తావిస్తాం. తెలంగాణ బీజేపీ ఎంపీలకు అభివృద్ధి అవసరం లేదా?. కేంద్రం తీరు సమాఖ్య స్పూర్తికి విరుద్ధం. ఒక రాష్ట్ర  సీఎం పర్యటనను అడ్డుకోవడం ఆషామాషీ కాదు. నా పర్యటనను అడ్డుకోవచ్చు. కానీ ఆలోచనను కాదు. సీఎం పర్యటనను అడ్డుకోవడం అంటే తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడమే. విదేశాల్లో ఉండి మాట్లాడితే దేశ ద్రోహి అనేవారు. అందుకే ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నా’ అని వ్యాఖ్యానించారు.

(👉ఇదీ చదవండి: కొండా సురేఖ అంశం.. ఏం చేస్తే ఏమవునో )

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement