సుక్మాలో మందుపాతర పేలుడు.. నలుగురు జవాన్లకు తీవ్ర గాయాలు! | Sukma Landmine Blast Four BDS Jawans Injured | Sakshi
Sakshi News home page

సుక్మాలో మందుపాతర పేలుడు.. నలుగురు జవాన్లకు తీవ్ర గాయాలు!

Oct 8 2026 11:44 PM | Updated on Oct 8 2026 11:55 PM

Sukma Landmine Blast Four BDS Jawans Injured

భద్రాచలం: తెలంగాణ-చత్తీస్‌గఢ్‌ సరిహద్దులోని సుక్మా జిల్లాలో ఓ మందుపాతర పేలడంతో నలుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. సుక్మా జిల్లా బెజ్జి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బొడ్రాజ్‌ఫదర్‌ కల్వర్టు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. కల్వర్టు సమీపంలో గుర్తించిన బాంబును నిర్వీర్యం చేస్తుండగా ప్రమాదవశాత్తు ఒక్కసారిగా పేలింది. దీంతో బాంబు నిర్వీర్య బృందానికి చెందిన నలుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు.

సుక్మా జిల్లా ఎస్పీ సుకుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. బొడ్రాజ్‌ఫదర్‌ కల్వర్టు వద్ద బాంబును గుర్తించిన బాంబు నిర్వీర్య బృందం దానిని నిర్వీర్యం చేసే పనిలో నిమగ్నమైంది. అయితే, నిర్వీర్యం చేస్తుండగానే పేలుడు సంభవించడంతో అక్కడున్న నలుగురు జవాన్లు గాయపడ్డారు. గాయపడిన వారిలో ఓ ఎస్సై, ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు ఉన్నట్లు సమాచారం. దీంతో వెంటనే వారిని సుక్మా జిల్లా కుంట ఆస్పత్రికి తరలించారు.

కుంట ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నలుగురు జవాన్లను భద్రాచలంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అయితే, గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఎస్పీ సుకుమార్‌ తెలిపారు. అలాగే, ప్రస్తుతం భద్రాచలంలోని ఆస్పత్రిలో వైద్యులు గాయపడిన జవాన్లకు చికిత్స అందిస్తున్నారు..

ఇదీ చదవండి: ఖమ్మం బైపాస్‌ రోడ్డుపై ఘోర ప్రమాదం.. మూడేళ్ల చిన్నారి మృతి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement