breaking news
landmine explosion
-
పేలుడు ధాటికి తునాతునకలైన కారు
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు రెచ్చిపోయారు. బీజాపూర్ జిల్లా బాసగూడెం పోలీసు స్టేషన్ పరిధిలో తర్రెం వద్ద మందు పాతరలు పేల్చారు. రహదారిపై వెళుతున్న వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు గ్రామస్తులు గాయపడ్డారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.(చదవండి: యూపీలో జర్నలిస్టు పాశవిక హత్య) ఇదిలా ఉండగా.. పోలీసు ఇన్ఫార్మర్ అన్న నెపంతో ఇద్దరు గ్రామస్తులను మావోయిస్టులు దారుణంగా హత్య చేశారు. బీజాపూర్ జిల్లాలోని గంగుళూరు పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనాస్థలిలో లేఖ వదిలి అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
బలగాల వాహనం పేల్చివేత
రాయ్‌పూర్ / చర్ల / చింతూరు (రంపచోడవరం): ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. దంతేవాడ జిల్లాలో రోడ్డు నిర్మాణ పనులకు గస్తీ నిర్వహిస్తున్న బలగాల వాహనాన్ని ఆదివారం మందుపాతరతో పేల్చివేశారు. ఈ దాడిలో ఏడుగురు జవాన్లు దుర్మరణం చెందారు. మావోల దాడిని పిరికిపందల చర్యగా ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్‌సింగ్ అభివర్ణించారు. దంతేవాడ జిల్లాలోని బచేలి–చోల్నార్ రోడ్డు నిర్మాణ పనులకు సామగ్రిని తరలిస్తున్న వాహనాలకు ఛత్తీస్‌గఢ్ ఆర్మ్డ్ ఫోర్స్(సీఏఎఫ్), డిస్ట్రిక్ ఫోర్స్(డీఎఫ్) సంయుక్త బలగాలు రక్షణ కల్పిస్తున్నాయని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇందులోభాగంగా గస్తీ నిర్వహిస్తున్న బలగాల వాహనం చోల్నార్ గ్రామ సమీపంలోకి రాగానే మావోలు శక్తిమంతమైన మందుపాతరను పేల్చారన్నారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు జరిగిన ఈ దాడిలో బలగాల వాహనం తునాతునకలైందని వెల్లడించారు. ల్యాండ్‌మైన్ పేలుడు అనంతరం దాదాపు 200 మంది మావోలు బలగాలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారన్నారు. ఐదుగురు జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు చికిత్స పొందుతూ చనిపోయారని పేర్కొన్నారు. మృతుల్లో డీఎఫ్ బలగాలకు చెందిన హెడ్‌కానిస్టేబుల్ రామ్‌కుమార్, కానిస్టేబుల్ తికేశ్వర్ ధ్రువ్, అసిస్టెంట్ కానిస్టేబుల్ షాలిక్‌రామ్, సీఏఎఫ్ బెటాలియన్‌కు చెందిన హెడ్‌కానిస్టేబుల్ విక్రమ్ యాదవ్, కానిస్టేబుళ్లు రాజేశ్ కుమార్, రవినాథ్ పటేల్, అర్జున్ రాజ్భర్లు ఉన్నారు. దాడి అనంతరం బలగాల దగ్గరున్న ఆయుధాల్ని మావోయిస్టులు ఎత్తుకెళ్లారు. ఇటీవల గడ్చిరోలీ, మల్కన్‌గిరితో పాటు బీజాపూర్‌లో భద్రతాబలగాల దాడిలో భారీగా నష్టపోయిన మావోలు.. ప్రతీకారంగానే ఈ దాడికి పాల్పడినట్లు పోలీస్ వర్గాలు భావిస్తున్నాయి. -
మందుపాతర పేలుడు : ముగ్గురి మృతి
ఛత్తీస్‌గఢ్ : ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోసారి మందుపాతర పేల్చారు. నారాయణపూర్ జిల్లా తుంనార్ వద్ద బుధవారం రాత్రి భద్రతా బలగాలే లక్ష్యంగా అత్యంత ప్రమాదకరమైన ఐఈడీ(ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్)ని పేల్చారు. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందగా నలుగురికి తీవ్ర గాయాలైనట్లు ఎస్పీ అభిషేక్ మీనా తెలిపారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నామన్నారు. మృతి చెందిన వారిలో 15 ఏళ్ల బాలిక, ఇద్దరు మహిళలు ఉండగా, మరో నలుగురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారని ఎస్పీ చెప్పారు.