మావోయిస్టుల దుశ్చర్య.. ఇద్దరి హత్య

Maoists Blast Landmine Chhattisgarh Bijapur District - Sakshi

బీజాపూర్ జిల్లాలో మావోయిస్టుల దుశ్చర్య

ఛత్తీస్‌గఢ్‌లో రెచ్చిపోయిన మావోయిస్టులు

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు రెచ్చిపోయారు. బీజాపూర్ జిల్లా బాసగూడెం పోలీసు స్టేషన్ పరిధిలో తర్రెం వద్ద మందు పాతరలు పేల్చారు. రహదారిపై వెళుతున్న వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు గ్రామస్తులు గాయపడ్డారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.(చదవండి: యూపీలో జర్నలిస్టు పాశవిక హత్య)

ఇదిలా ఉండగా.. పోలీసు ఇన్ఫార్మర్ అన్న నెపంతో ఇద్దరు గ్రామస్తులను మావోయిస్టులు దారుణంగా హత్య చేశారు. బీజాపూర్ జిల్లాలోని గంగుళూరు పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనాస్థలిలో లేఖ వదిలి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top