breaking news
jawans injured
-
ఆర్మీ వాహనంపై ఉగ్ర దాడి
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలోని అరిహల్‌లో ఆర్మీ అధికారుల వాహనాన్ని లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు బాంబు దాడి చేశారు. ఈ దాడిలో తొమ్మిది మంది భద్రతా సిబ్బంది, ఇద్దరు పౌరులు గాయపడ్డారు. ఈ దాడికి ఉగ్రవాదులు శక్తిమంతమైన ఇంప్రొవైస్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (ఐఈడీ)ని వినియోగించారు. ఫిబ్రవరి 14న ఓ సూసైడ్ బాంబర్ 40 మంది సీఆర్పీఎఫ్ అధికారులను బలితీసుకున్న ప్రాంతానికి ఇది కేవలం 27 కిలోమీటర్ల దూరంలోనే జరగడం గమనార్హం. 44 రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన ఈ ఆర్మీ వాహనం బుల్లెట్, మైన్ ప్రూఫ్ కావడంతో సైన్యానికి పెను ప్రమాదం తప్పిందని పోలీసులు తెలిపారు. దక్షిణ కశ్మీర్ జిల్లాలోని అరిహల్ లస్సిపురా రోడ్డు మీద ఈ దాడి జరిగింది. అనంతరం పరిస్థితిని అదుపులోకి తేవడానికి మరికొంత మంది సిబ్బందిని రప్పించి, గాల్లోకి కాల్పులు జరిపామని అధికారులు తెలిపారు. చిన్నగాయాలు మినహా ఏ నష్టమూ జరగలేదని, ఉగ్రవాదులు చేసిన దాడి విఫలమైందని కల్నల్ రాజేష్ కలియా అన్నారు. బాంబుదాడి అనంతరం కూడా సోదాలు కొనసాగాయని అన్నారు. అయితే పుల్వామాలో ఉగ్రవాదులు దాడి చేయనున్నారని పాకిస్తాన్ ముందే హెచ్చరించడం గమనార్హం. పాక్ చెప్పడానికి కారణాలేంటి? అల్‌కాయిదాకు అనుబంధ సంస్థకు చెందిన ఉగ్రవాది జకీర్ మూసాను చంపినందుకు ప్రతీకారంగా భారత్‌లో దాడులు చేయాలని ఉగ్రవాదులు నిర్ణయించుకున్నట్లు తమకు సమాచారం అందిందని పాక్ ఇటీవల భారత ప్రభుత్వానికి తెలిపింది. ఈ దాడులు అమర్నాథ్ యాత్రకు ముందుగానీ, తర్వాతగానీ దాడులు చేసేందుకు ఉగ్రమూకలు సిద్ధంగా ఉన్నారంది. 2016లో కూడా పాక్ జాతీయ భద్రతా సలహాదారు నసీర్ జాంజువా అప్పటి భారత జాతీయ భద్రతా సలహాదారు ధోవల్‌కు గుజరాత్లో 26/11 లాంటి దాడులు నిర్వహించేందుకు ఉగ్రవాదులు పథకం పన్నారని తెలిపారు. పాక్ ఇలాంటి హెచ్చరికలు చేయడంపై పలు అనుమానాలు వెల్లువెత్తున్నాయి. అంతర్జాతీయ సమాజంలో తాము ఉగ్రవాదానికి వ్యతిరేకులమన్న సందేశాన్ని వ్యాప్తి చేయడమే పాక్ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. -
కశ్మీర్లో ఉగ్రదాడి: జవాన్లకు గాయాలు
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ లోని శ్రీనగర్ పట్టణ శివారులో శుక్రవారం రాత్రి ఉగ్రవాదులు జరిపిన హిట్ అండ్ రన్ దాడిలో నలుగురు జవాన్లు గాయపడ్డారు. విధులు నిర్వహిస్తున్న జవాన్లను వాహనంలో ప్రయాణిస్తున్న ఉగ్రవాదులు ఢీకొట్టి పారిపోయారని సైనిక వర్గాలు ప్రకటించారు. గాయపడ్డ నలుగురూ సశస్త్ర సీమాబల్(ఎస్ఎస్ బీ) విభాగానికి చెందినవారని పేర్కొన్నారు. పారిపోయిన ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు భావిస్తున్న ప్రాంతాన్ని చుట్టుముట్టిన భద్రతా బలగాలు అణువణువూ తనిఖీ చేస్తున్నాయి. పాక్ ఆక్రమిత్ కశ్మీర్ లోని ఉగ్రస్థావరాలపై భారత సైన్యం దాడులు జరిపిన తర్వాత ఇప్పటికే భారత్ లోకి ప్రవేశించిన ఉగ్రవాదులు పెద్ద ఎత్తున దాడులకు పాల్పడే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో కశ్మీర్ సహా పాక్ సరిహద్దులోని నాలుగు రాష్ట్రాల్లో బలగాలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. -
జమ్మూలో టెర్రరిస్టుల ఘాతుకం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ఆర్మీ క్యాంపులను లక్ష్యంగా చేసుకుని టెర్రరిస్టులు దాడులకు పాల్పడ్డారు. జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో 3 ఆర్మీ, సీఆర్పీఎఫ్ క్యాంపులపై వేర్వేరుగా దాడులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు జవాన్లు గాయపడ్డారు. ఆర్మీ ఆస్పత్రిలో వారికి చికిత్స అందిస్తున్నారు. దాడులు జరిగిన పుల్వామా ప్రాంతం రాజధాని శ్రీనగర్ కు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. గ్రెనెడ్లుతో దాడులకు పాల్పడటంతో పాటు కాల్పులకు తెగబడ్డారని అధికారులు వెల్లడించారు. అదేవిధంగా కరీమాబాద్ జిల్లాలోనూ టెర్రరిస్టులు కాల్పులు జరిపారని సమాచారం అందింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.