జమ్మూలో టెర్రరిస్టుల ఘాతుకం | 3 Army, CRPF Camps Attacked In Jammu And Kashmir's Pulwama | Sakshi
Sakshi News home page

జమ్మూలో టెర్రరిస్టుల ఘాతుకం

Jul 1 2016 11:03 PM | Updated on Aug 11 2018 9:02 PM

జమ్మూకశ్మీర్‌లో ఆర్మీ క్యాంపులను లక్ష్యంగా చేసుకుని టెర్రరిస్టులు దాడులకు పాల్పడ్డారు.

శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ఆర్మీ క్యాంపులను లక్ష్యంగా చేసుకుని టెర్రరిస్టులు దాడులకు పాల్పడ్డారు. జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో 3 ఆర్మీ, సీఆర్పీఎఫ్ క్యాంపులపై వేర్వేరుగా దాడులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు జవాన్లు గాయపడ్డారు. ఆర్మీ ఆస్పత్రిలో వారికి చికిత్స అందిస్తున్నారు. దాడులు జరిగిన పుల్వామా ప్రాంతం రాజధాని శ్రీనగర్ కు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. గ్రెనెడ్లుతో దాడులకు పాల్పడటంతో పాటు కాల్పులకు తెగబడ్డారని అధికారులు వెల్లడించారు. అదేవిధంగా కరీమాబాద్ జిల్లాలోనూ టెర్రరిస్టులు కాల్పులు జరిపారని సమాచారం అందింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement