ఖమ్మం బైపాస్‌ రోడ్డుపై ఘోర ప్రమాదం.. మూడేళ్ల చిన్నారి మృతి! | Khammam Road Accident Child Dies Incident | Sakshi
Sakshi News home page

ఖమ్మం బైపాస్‌ రోడ్డుపై ఘోర ప్రమాదం.. మూడేళ్ల చిన్నారి మృతి!

Oct 8 2026 11:03 PM | Updated on Oct 8 2026 11:03 PM

Khammam Road Accident Child Dies Incident

ఖమ్మం: జిల్లాలోని బైపాస్‌ రోడ్డుపై ఎన్టీఆర్‌ సర్కిల్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌పై తల్లిదండ్రులతో కలిసి ప్రయాణిస్తున్న మూడేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు రోడ్డుపై పడిపోగా.. వెనుక నుంచి వచ్చిన లారీ చిన్నారి తలపై నుంచి వెళ్లింది. ఈ ఘటనలో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది.

పోలీసుల వివరాల ప్రకారం.. కల్లూరు మండలం ఎర్రబోయినపల్లి గ్రామానికి చెందిన జెట్టి అశోక్‌ తన భార్య, మూడేళ్ల కుమార్తెతో కలిసి బైక్‌పై ఖమ్మం నగరానికి వచ్చారు. బైక్‌పై తల్లిదండ్రుల మధ్య చిన్నారిని కూర్చోబెట్టుకుని వెళ్తుండగా ఎన్టీఆర్‌ సర్కిల్‌ వద్ద ట్రాఫిక్‌ సిగ్నల్‌ గ్రీన్‌ పడింది. దీంతో అశోక్‌ బైక్‌ను ముందుకు కదిలించాడు.

ఈ క్రమంలో మధ్యలో కూర్చున్న చిన్నారి ఒక్కసారిగా బైక్‌పై నుంచి జారి రోడ్డుపై పడిపోయింది. అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న లారీ చిన్నారి తలపై నుంచి వెళ్లడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది.

కళ్లముందే కుమార్తె మృతి చెందడంతో తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ప్రమాద వివరాలను సేకరించారు. లారీని ఖమ్మం టూ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: పెళ్లైనా పాత బంధాన్ని వదల్లేక కిరాతకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement