ఇంకా కొరతే.... | - | Sakshi
Sakshi News home page

ఇంకా కొరతే....

Nov 23 2026 5:36 AM | Updated on Nov 23 2026 5:36 AM

● మూడు నెలలైనా పూర్తికాని టీచర్ల సర్దుబాటు ● పలు పాఠశాలల్లో వేధిస్తున్న సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరత ● ఫలితంగా సాఫీగా సాగని బోధన షోకాజ్‌ నోటీసులు ఇచ్చాం

మచ్చుకు కొన్ని...

● మూడు నెలలైనా పూర్తికాని టీచర్ల సర్దుబాటు ● పలు పాఠశాలల్లో వేధిస్తున్న సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరత ● ఫలితంగా సాఫీగా సాగని బోధన

ఖమ్మం సహకారనగర్‌: జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరతను అధిగమించి బోధనను మెరుగుపర్చాలనే ఉద్దేశంతో చేపట్టిన సర్దుబాటు ప్రక్రియ నెలల తరబడి కొనసాగుతోంది. దీంతో క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తీరకపోగా, కొన్ని స్కూళ్లలో కొత్త సమస్యలు మొదలయ్యాయి. ఫలితంగా పాఠశాలల్లో బోధనపై ప్రభావం పడుతోంది.

440మంది సర్దుబాటు

ఇప్పటివరకు జిల్లాలో 440 మంది వివిధ కేటగిరీలు, సబ్జెక్టు ఉపాధ్యాయులను సర్దుబాటు చేశారు. ఇందులో అత్యధికంగా ఎస్జీటీ విభాగం నుంచి 239 మంది ఉన్నారు. అలాగే, గ్రేడ్‌–2 హెచ్‌ఎం ఒకరు, ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎంలు, పీఈటీలు ఇద్దరు చొప్పున ఉన్నారు. వీరే కాక వివిధ సబ్జెక్టుల స్కూల్‌ అసిస్టెంట్లు, తదితరులు ఉన్నారు. కాగా, ఇందులో నుంచి ఐదుగురు ఉపాధ్యాయులు విధుల్లో చేరకపోవడంతో షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. అయితే, కొన్ని పాఠశాలల్లో పరిస్థితిని సరిగ్గా అంచనా వేయకుండా సర్దుబాటు చేశారనే విమర్శలు వస్తున్నాయి. అంతేకాక సర్దుబాటు పూర్తి కాకపోవడంతో కొన్ని పాఠశాలల్లో అవసరానికి సరిపడా ఉపాధ్యాయులు లేక బోధనకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రధానంగా ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరతతో బోధన నిలిచిపోయినట్లు చెబుతున్నారు.

శాసీ్త్రయత కరువు

విద్యాసంవత్సరం ఆరంభంలోనే ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుంది. కానీ నెలల తర్వాత చేపట్టినా క్షేత్రస్థాయి పరిస్థితులను సరిగ్గా పరిశీలించకపోవడంతో లోపాలు వెలుగు చూస్తున్నాయి. ఏ పాఠశాలలో ఎందరు ఉపాధ్యాయులు అవసరం.. సబ్జెక్టు టీచర్ల కొరత ఎక్కడెక్కడ ఉంది.. అన్న అంశాలను సమగ్ర పరిశీలన చేయలేదనే ఆరోపణలు వస్తున్నాయి. తాత్కాలిక ఏర్పాట్లతో కాకుండా పాఠశాలల్లో వాస్తవ అవసరాలకు అనుగుణంగా సర్దుబాటు చేపడితేనే విద్యాబోధన సజావుగా సాగుతుందని పలువురు సూచిస్తున్నారు.

జిల్లాలో ఇప్పటి వరకు 440మంది ఉపాధ్యాయుల సర్దుబాటు పూర్తయింది. వీరిని సబ్జెక్ట్‌ టీచర్ల కొరత ఉన్న పాఠశాలల్లో సర్దుబాటు చేశాం. విధుల్లో చేరని ఐదుగురు ఉపాధ్యాయులకు షోకాజ్‌ నోటీసులు ఇచ్చాం. ఇంకా ఎక్కడైనా సమస్య ఉంటే తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నాం.

– డి.వాసంతి, జిల్లా విద్యాశాఖాధికారి

పెనుబల్లి మండలం కొండ్రుపాడు ఉన్నత పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడు అవసరం ఉన్నా, బోనకల్‌ మండలం ఆళ్లపాడు పాఠశాలకు కేటాయించారు. దీంతో కొండ్రుపాడులో బోధన నిలిచిపోయింది.

కొణిజర్ల మండలం కొణిజర్ల హైస్కూల్‌లో సోషల్‌ టీచర్‌ లేరు. ఫిజిక్స్‌ టీచర్‌ డిప్యూటేషన్‌పై ఖమ్మం డైట్‌ కళాశాలలో విధులు నిర్వర్తిస్తున్నారు.

తనికెళ్ల హైస్కూల్‌లో తెలుగు పండిట్‌, హిందీ పండిట్‌ పోస్టులు ఖాళీ ఉండగా... అదే పాఠశాలలో మ్యాథ్స్‌ టీచర్‌ రిటైర్‌ అయ్యారు.

కొణిజర్ల మండలం పల్లిపాడు గుబ్బగుర్తి హైస్కూల్‌ ఇంగ్లిష్‌ టీచర్‌ ‘ఎల్టా’ కార్యక్రమంలో భాగంగా డిప్యూటేషన్‌పై పని చేస్తున్నారు. రెగ్యులర్‌ ఇంగ్లిష్‌ టీచర్‌ లేక బోధన జరగకోవడంతో పలుమార్లు ఆందోళనలు చేపట్టారు.

పెద్దమునగాల సోషల్‌ టీచర్‌ రిటైర్‌ అయినా ఇంకా ఎవరినీ నియమించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement