తెలుగు కథ విశ్వజనీనమైనది | - | Sakshi
Sakshi News home page

తెలుగు కథ విశ్వజనీనమైనది

Nov 23 2026 5:36 AM | Updated on Nov 23 2026 5:36 AM

ఖమ్మంగాంధీచౌక్‌: తెలుగు కథ విశ్వజనీనమైనదని, విలక్షణమైన జీవన వాస్తవికతకు దర్పణంగా నిలుస్తోందని ప్రముఖ కథా విశ్లేషకులు ఏ.వీ.రమణమూర్తి తెలిపారు. ఖమ్మంలో శని, ఆదివారాల్లో కథాంతరంగం, ఖమ్మం ఈస్తటిక్స్‌ పురస్కారాల వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా ‘ఆరు జిల్లాల కథలు – తులనాత్మక పరిశీలన’ అంశంపై 36 మంది కథకులు, ఆరుగురు విశ్లేషకులు ఆరు సెషన్లుగా మాట్లాడగా కథకులు జి.వెంకటకష్ణ, బీవీఎన్‌.స్వామి, ఎల్‌ఎస్‌ఆర్‌.ప్రసాద్‌, శ్రీఊహ పరిశీలకులుగా పాల్గొన్నారు. అనంతరం కథా పోటీల్లో బహుమతి పొందిన, సాధారణ ప్రచురణకు ఎంపికై న 14 కథలతో కూడిన ‘ఈస్తటిక్స్‌ – 2026’ కథా సంకలనాన్ని పురస్కారాల కమిటీ సభ్యులు రవిమారుత్‌, ప్రసేన్‌, మువ్వా శ్రీనివాసరావు, సీతారాం, వంశీకృష్ణ, కన్నోజు ఫణిమాధవి, పగిడిపల్లి వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు. అలాగే, కథల విభాగంలో బి.నాగశేషు, కవిత్వంలో నాగ్‌జ్యోతి శేఖర్‌కు పురస్కారాలు అందజేశారు. అంతేకాక కథకులు పలువురికి పురస్కారాలను అందించగా, హార్వెస్ట్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ పార్వతీరెడ్డి, వైద్యులు ఆనందవాణి, రవీంద్రనాథ్‌, నాగమణి, ధరణికోట రమేష్‌ కుమార్‌, సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.

ఈస్తటిక్స్‌ పురస్కారాల వేడుకలో

రమణమూర్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement