చర్ల: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అండర్–17 రాష్ట్రస్థాయి వాలీ బాల్ క్రీడా పోటీలు నేటి నుంచి చర్లలో జరగనున్నాయి. సోమవారంనుంచి మూడు రోజుల పాటు క్రీడలు నిర్వహించనుండగా పోలీస్ గ్రౌండ్‌లో ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్రంలోని ఉమ్మడి 10 జిల్లాల నుంచి 10 జట్లు హాజరుకానున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వ హైస్కూళ్లకు చెందిన 160 మంది పీడీలు కూడా తరలిరానున్నారు. ఇక్కడ జరిగే పోటీల్లో ప్రతిభ చూపినవారిని ఎంపిక చేసి డిసెంబర్ 26 నుంచి 31 వరకు గుజరాత్‌లో నిర్వహించే జాతీయ స్థాయి పోటీలకు పంపిస్తారు. కాగా, క్రీడాకారులకు భోజన, వసతి సౌకర్యాలు కల్పించారు.
అండర్–17 వాలీబాల్ క్రీడలకు ఏర్పాట్లు పూర్తి


