మిస్టర్ ఇండియా ఇంటర్నేషనల్ కాస్మోస్ సీజన్ 7 విజేత శ్రీనివాస్ రెడ్డి! | Srinivas Reddy is the winner of Mr India International Cosmos Season 7 | Sakshi
Sakshi News home page

మిస్టర్ ఇండియా ఇంటర్నేషనల్ కాస్మోస్ సీజన్ 7 విజేత శ్రీనివాస్ రెడ్డి!

Oct 28 2026 10:28 PM | Updated on Oct 28 2026 10:33 PM

Srinivas Reddy is the winner of Mr India International Cosmos Season 7

న్యూఢిల్లీ: వీపీఆర్ ప్రొడక్షన్స్‌ నిర్వహించిన మిస్టర్‌ ఇండియా ఇంటర్నేషనల్‌ కాస్మోస్‌ సీజన్‌-7 పోటీల్లో తెలంగాణకు చెందిన శ్రీనివాస్ రెడ్డి విజేతగా నిలిచారు. అదే విధంగా  బెస్ట్ క్యాస్టూమ్- మేల్‌  అవార్డును సైతం  గెలుచుకున్నారు. ఈ వేడుకలో గతేడాది 2025 విజేత మిస్టర్‌ ఇండియా విన్నర్‌ డాక్టర్‌ సందీప్ చేతుల మీదుగా శ్రీనివాస్ రెడ్డి విజేత అవార్డును అందుకున్నారు.అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్ రెడ్డి తన ప్రతిభ, ఆత్మవిశ్వాసం, స్టేజ్ ప్రెజెన్స్‌తో న్యాయనిర్ణేతలను ఆకట్టుకున్నారు. 

ఈ సందర్భంగా VRP Productions నేషనల్ డైరెక్టర్ డా. ఎం. రీతు రావు, శ్రీనివాస్ రెడ్డికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఆయన విజయానికి మార్గదర్శకత్వం వహించిన మెంటర్, స్టేట్ కోఆర్డినేటర్, జ్యూరీ ఛైర్‌పర్సన్ విజయలక్ష్మి కవ్వం  సేవలను సైతం అభినందించారు. వీఆర్‌పీ ప్రొడక్షన్స్‌ వామని క్రియేషన్స్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రతిష్ఠాత్మక పోటీల్లో శ్రీనివాస్ రెడ్డి సాధించిన విజయం తెలంగాణకు గర్వకారణంగా నిలిచిందని పలువురు ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆయనకు  హృదయపూర్వక అభినందనలు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement