కొమ్మినేని తప్పేమీ లేదు.. జర్నలిస్టులను భయపెట్టే విధంగా అరెస్టులు | Senior Journalists Opinions On Democracy Freedom of the Press Round Table | Sakshi
Sakshi News home page

కొమ్మినేని తప్పేమీ లేదు.. జర్నలిస్టులను భయపెట్టే విధంగా అరెస్టులు

Jun 14 2025 1:34 PM | Updated on Jun 14 2025 7:15 PM

Senior Journalists Opinions On Democracy Freedom of the Press Round Table

సాక్షి, హైదరాబాద్‌: ప్రజాస్వామ్యానికి, పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించే శక్తులు ఆరంభం నుంచి ఇప్పటిదాకా వివిధ రూపాల్లో, వివిధ స్థాయిలో ఉన్నాయని పలువురు సీనియర్‌ జర్నలిస్టులు అభిప్రాయపడ్డారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో పత్రికా స్వేచ్ఛను కాపాడాల్సిన ఆవ‌శ్య‌క‌త ఎంతో ఉంద‌ని నొక్కి చెప్పారు. రాజ‌కీయ క‌క్ష‌తో మీడియాపై దాడులు సరికాద‌ని పాల‌కుల‌కు హిత‌వు పలికారు. పత్రికా స్వేచ్ఛపై జ‌రుగుతున్న దాడుల‌ను అంద‌రూ ముక్త కంఠంతో ఖండించాల‌ని పిలుపునిచ్చారు.

శనివారం హైదరాబాద్‌ ప్రెస్‌ క్లబ్‌లో ‘డెమోక్రసీ- ఫ్రీడమ్‌ ఆఫ్‌ ది ప్రెస్‌’ అంశంపై రౌండ్‌ టేబుల్‌​ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీనియ‌ర్ పాత్రికేయులు రామచంద్రమూర్తి, అల్లం నారాయణ, కే శ్రీనివాస్‌, దేవులపల్లి అమర్‌, దిలీప్‌రెడ్డి, విజయ్‌బాబు, శైలేశ్‌రెడ్డి, రెహ‌మాన్‌, సాక్షి దిన‌ప‌త్రిక సంపాద‌కులు ఆర్‌. ధ‌నంజ‌య‌రెడ్డి.. ఇంకా పలువురు జర్నలిస్టులు పాల్గొని తమ అభిప్రాయాలను తెలియజేశారు. సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ కొమ్మినేని శ్రీనివాస‌రావు అరెస్ట్‌ను వీరంతా ఖండించారు. 

ఎవరేమన్నారంటే.. 
ప్రజాస్వామ్యం-పత్రికా స్వేచ్ఛ.. ఈ రెండు ప్రశ్నార్థకాలే. కేఎస్‌ఆర్‌ కాంట్రవర్సీగా మాట్లాడే వ్యక్తి కాదు. సాక్షి కార్యాలయాలపై దాడి సరికాదు: రామచంద్రమూర్తి

ప్రజల భాగస్వామ్యంతోనే పత్రిక స్వేచ్చను కాపాడాలి: టంకశాల అశోక్‌

కొమ్మినేనిని అరెస్ట్‌ చేయాల్సిన అవసరం లేదు: కే. శ్రీనివాస్‌

పత్రికా స్వేచ్చకు భగం కలిగించారు: విజయ్‌బాబు

కొమ్మినేని శ్రీనివాస్‌ తప్పేమీ లేదు. జర్నలిస్టులను భయపెట్టే విధంగా అరెస్టులు. ప్రజాస్వామ్యంలో ప్రతికా స్వేచ్ఛ భాగమే: దేవులపల్లి అమర్‌

 

 

 

Advertisement
 
Advertisement
Advertisement