breaking news
k srinivas
-
కొమ్మినేని తప్పేమీ లేదు.. జర్నలిస్టులను భయపెట్టే విధంగా అరెస్టులు
సాక్షి, హైదరాబాద్: ప్రజాస్వామ్యానికి, పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించే శక్తులు ఆరంభం నుంచి ఇప్పటిదాకా వివిధ రూపాల్లో, వివిధ స్థాయిలో ఉన్నాయని పలువురు సీనియర్ జర్నలిస్టులు అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో పత్రికా స్వేచ్ఛను కాపాడాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని నొక్కి చెప్పారు. రాజకీయ కక్షతో మీడియాపై దాడులు సరికాదని పాలకులకు హితవు పలికారు. పత్రికా స్వేచ్ఛపై జరుగుతున్న దాడులను అందరూ ముక్త కంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు.శనివారం హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ‘డెమోక్రసీ- ఫ్రీడమ్ ఆఫ్ ది ప్రెస్’ అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీనియర్ పాత్రికేయులు రామచంద్రమూర్తి, అల్లం నారాయణ, కే శ్రీనివాస్, దేవులపల్లి అమర్, దిలీప్‌రెడ్డి, విజయ్‌బాబు, శైలేశ్‌రెడ్డి, రెహమాన్, సాక్షి దినపత్రిక సంపాదకులు ఆర్. ధనంజయరెడ్డి.. ఇంకా పలువురు జర్నలిస్టులు పాల్గొని తమ అభిప్రాయాలను తెలియజేశారు. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్‌ను వీరంతా ఖండించారు. ఎవరేమన్నారంటే.. ప్రజాస్వామ్యం-పత్రికా స్వేచ్ఛ.. ఈ రెండు ప్రశ్నార్థకాలే. కేఎస్ఆర్ కాంట్రవర్సీగా మాట్లాడే వ్యక్తి కాదు. సాక్షి కార్యాలయాలపై దాడి సరికాదు: రామచంద్రమూర్తిప్రజల భాగస్వామ్యంతోనే పత్రిక స్వేచ్చను కాపాడాలి: టంకశాల అశోక్కొమ్మినేనిని అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు: కే. శ్రీనివాస్పత్రికా స్వేచ్చకు భగం కలిగించారు: విజయ్బాబుకొమ్మినేని శ్రీనివాస్ తప్పేమీ లేదు. జర్నలిస్టులను భయపెట్టే విధంగా అరెస్టులు. ప్రజాస్వామ్యంలో ప్రతికా స్వేచ్ఛ భాగమే: దేవులపల్లి అమర్ -
పోలీసులు నడిరోడ్డు మీద థర్డ్ డిగ్రీ ప్రదర్శించవచ్చా?
సాక్షి, అమరావతి: తెనాలి పోలీసులు యువకులను నడిరోడ్డు మీద బూటుకాలితో తొక్కిపెట్టి లాఠీలతో కొట్టిన ఘటనపై సీనియర్ సంపాదకుడు కె.శ్రీనివాస్ ఎక్స్‌లో బుధవారం స్పందించారు. పోలీసులు నడి రోడ్డు మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించడాన్ని ఆయన వ్యంగ్యంగా ప్రశ్నించారు. దీన్ని హోంమంత్రి అనిత సమర్థించడాన్ని ఆయన ఆక్షేపించారు. ‘అరికాళ్ల మీద లాఠీలు, మోకాళ్ల మీద తొక్కుడు కాళ్లు అనుభవించిన ఆ యువకులకు కులం లేదు.. లాఠీల తొక్కుడుకాళ్ల భటులకు కులం లేదు, ఒప్పకుందాం. వాళ్లు ఎస్కోబార్ అంతటి నార్కో డాన్స్, అదీ ఒప్పుకుందాం.. ఏపీ హోం మంత్రికి, ముఖ్యమంత్రి కులం లేదు అదీ ఒప్పుకుందాం’.. కానీ పోలీసులు అట్లా నడిరోడ్డు మీద థర్డ్ డిగ్రీ ప్రదర్శన చేయవచ్చా? దాన్ని హోంమంత్రి సమరి్థస్తూ మాట్లాడవచ్చా, ముఖ్యమంత్రి కూడా నర్మగర్భంగా సపోర్ట్ చేయవచ్చా? అని ప్రశ్నించారు. డాక్టర్ సుధాకర్, రఘురామరాజు విషయంలో ఏం మాట్లాడారో మరచిపోవచ్చా అని పేర్కొన్నారు. కులం మరచి, దెబ్బలతో మైమరచి, కేరింతలు కొట్టండి అంటూ ప్రభుత్వానికి చురకలు వేశారు. -
‘డిస్మిస్ కార్మికుల సమస్య పరిష్కరించండి’
సాక్షి, హైదరాబాద్: సింగరేణిలో గైర్హాజరు కారణంగా డిస్మిస్ చేసిన కార్మికులకు వన్‌టైం చాన్స్ కింద ఉద్యోగాలివ్వాలని తెలంగాణ సింగరేణి డిస్మిస్ కార్మికుల సంఘం అ«ధ్యక్షుడు కె.శ్రీనివాస్ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. వన్‌టైం చాన్స్ కింద అవకాశం కల్పించే అంశంపై చర్చిస్తామన్న యాజమాన్యం ప్రతిసారీ దీన్ని వాయిదా వేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. 2014లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే డిస్మిస్ కార్మికులందరికీ ఉద్యోగాలు ఇస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని, కానీ ఇంతవరకు తమ సమస్య పరిష్కరించలేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, యాజమాన్యం తమ సమస్యలపై స్పందించాలని కోరారు. -
క్వార్టర్ ఫైనల్లో శ్రీనివాస్
సాక్షి, హైదరాబాద్: ప్రశాంత్ రణడే స్మారక స్టేట్ ర్యాంకింగ్ క్యారమ్ టోర్నమెంట్లో జాతీయ చాంపియన్ కె. శ్రీనివాస్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. రాంకోఠిలోని మహారాష్ట్ర మండల్ కార్యాలయంలో సోమవారం జరిగిన నాలుగో రౌండ్లో శ్రీనివాస్ 25-0, 25-2తో ఎస్.సాయిపై అలవోక విజయం సాధించాడు. మిగతా మ్యాచ్‌ల్లో అనిల్ కుమార్ 25-0, 25-5తో శశి కుమార్‌పై, ఉస్మాన్ 25-15, 10-13, 25-18తో అంజి రెడ్డిపై, రవీందర్ గౌడ్ 25-0, 25-8తో అంజద్‌పై, అహ్మద్ 20-5, 19-5తో అశ్విన్ కుమార్‌పై, వసీమ్ 25-15, 25-20తో కృష్ణపై, షారుక్ ఖాన్ 19-20, 21-20, 24-23తో జహీర్ అహ్మద్‌పై, సూర్యప్రకాశ్ 25-0, 25-0తో సయీద్‌పై, హకీమ్ 25-12, 25-6తో షాబాజ్‌పై, నయ్యర్ 25-0, 25-0తో గంగదాస్పై, ప్రసాద్ 15-25, 25-15, 18-15తో మొయిజ్‌పై విజయం సాధించారు. మహిళల తొలిరౌండ్లో నందిని 25-0, 25-10తో సునీతపై, స్రవంతి 18-10, 12-23, 25-6తో శ్రీవిద్యపై, సాయిలక్ష్మి 19-18, 25-0తో సునీతపై, అపూర్వ 25-0, 25-0తో ప్రేరణపై, ప్రసన్న లక్ష్మి 25-12, 25-10తో శ్రీచందనపై గెలుపొందారు.