
హైదరబాద్: ఇటీవల ర్యాగింగ్ కారణంగా విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ఉప్పల్ మేడిపల్లి సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌కి చెందిన సాయి తేజను సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేశారు. తరువాత సాయి తేజను సీనియర్ విద్యార్థులు బార్‌కి తీసుకెళ్లి, దాదాపు ₹10,000 బిల్లు చేశారు. బిల్లు మొత్తం సాయి తేజను కట్టమని ఒత్తిడి చేయడంతో తీవ్ర మనోవేదనకు గురై ఉరి వేసుకొని సాయి తేజ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఈ ఘటనపై ఇంకా అధికారికంగా పూర్తి వివరాలు తెలియాల్సి వుంది, కానీ ఇది ర్యాగింగ్ అనే దురాచారాన్ని మరోసారి వెలుగులోకి తీసుకొచ్చింది. విద్యాసంస్థలు, తల్లిదండ్రులు, ప్రభుత్వాలు కలిసి సున్నితంగా, కానీ కఠినంగా స్పందించాల్సిన అవసరం ఉంది.