ప్రియాంక పరిస్థితిపై తండ్రి కన్నీటి వేదన | Priyanka's Father Gets Emotional Her Daughter Condition | Sakshi
Sakshi News home page

ప్రియాంక పరిస్థితిపై తండ్రి కన్నీటి వేదన

Aug 8 2026 4:53 PM | Updated on Aug 8 2026 5:07 PM

Priyanka's Father Gets Emotional Her Daughter Condition

హైదరాబాద్‌: ఇద్దరు వ్యక్తులు ఉన్మాదానికి తన కూతురు ప్రియాంక జీవచ్ఛవంలా మారడంపై తండ్రి వెంకటేష్‌ కన్నీటి పర్యంతమవుతున్నారు. తమ కూతురు ఇప్పటికూడా బ్రతికే హోప్స్‌ లేవని డాక్టర్స్‌ చెబుతున్నా, చేసే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. బ్రెయిన్‌ పూర్తిగా డెడ్‌ అయిపోయిందని, శరీరం వైద్యానికి సహకరించడం లేదన్నారు. సాక్షి టీవీతో మాట్లాడిన ఆయన.. తమ కూతురి పరిస్థితికి కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని,  ఆ నిందితులను కొట్టి చంపాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

 ‘మా కూతురు ఇప్పటి కూడా బ్రతికే హోప్స్ లేవని చెప్తున్నారు  డాక్టర్స్. బ్రెయిన్ పూర్తిగా డెడ్ అయిపోయింది. అప్నియా పరీక్ష చేస్తామని చెప్పారు వైద్యులు. పాప సోడియం టెస్ట్ లెవెల్స్ డౌన్ ఉన్నాయి. బాడీ వైద్యానికి సహకరించడం లేదు. మేము అప్నియా పరీక్ష చేయమని చెప్పాము

అప్పుడు సోడియం లెవెల్స్ కరెక్ట్‌గా వస్తే వైద్యానికి శరీరం సహకరిస్తుంది.  పాప బ్రతికి రావాలని ప్రయత్నం చేస్తున్నాం. పాప అవయదానంపై మేము ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అవయవ దాన విషయంలో ఎవరు సంప్రదించలేదు. నా సతీమణి ఆరోగ్య పరిస్థితి బాగాలేదు ఆమెను ఐసీయూలో అడ్మిట్ చేశారు. ఏపీ ప్రభుత్వం స్పందించాలి. నిందితులను అతి కఠినంగా శిక్షించాలి. నడిరోడ్డుపై నిందితులను కొట్టి చంపాలి. సినిమా థియేటర్లో ఇద్దరు నిందితులు తాగి ఉన్నారు. థియేటర్ మేనేజ్‌మెంట్‌ వాళ్లతో గొడవ పెట్టుకున్నారు. 

అదే కోపంతో రాష్‌గా బయటికి వచ్చారు. మా కూతురు ఉమేష్ ఇద్దరు లోనికి వస్తున్న సమయంలో కారుతో ఢీకొట్టారు. కూతురు తలపై కారు ఎక్కించి ఎస్కేప్ అయ్యారు. కొంచెం కూడా సోయలేదా. పాప పరిస్థితి చూసి రాజమండ్రి నుంచి హైదరాబాద్‌ కిమ్స్‌కు తరలించాం. వైద్యులు అప్పుడే హోప్స్‌ లేవని చెప్పారు. మా అమ్మాయిని బ్రతికించండి అని ప్రాధేయ పడ్డాను. కిమ్స్‌ వైద్యులు స్పందించారు’ అని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement