ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌కృష్ణారెడ్డి కేసులో ట్విస్ట్‌ | CP Sajjanar Questioned Trainee IPS Officer Uday Krishna Reddy | Sakshi
Sakshi News home page

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌కృష్ణారెడ్డి కేసులో ట్విస్ట్‌

Aug 8 2026 3:40 PM | Updated on Aug 8 2026 4:29 PM

CP Sajjanar Questioned Trainee IPS Officer Uday Krishna Reddy

సాక్షి, హైదరాబాద్‌: ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌కృష్ణారెడ్డి కేసు అనేక మలుపులు తిరుగుతోంది. తాజాగా మరో ట్విస్ట్‌ చోటుచేసుకుంది. సూసైడ్‌ నోట్‌, ఆధారాలున్న ఐఫోన్‌ మాయమయ్యాయి. సూసైడ్‌ నోట్‌పై సీపీ సజ్జనార్‌ ప్రశ్నించగా.. తాగిన మైకంలో సూసైడ్‌ నోట్‌ రాశానన్న ఉదయ్‌.. ఆ నోట్‌ ఎక్కడ ఉందో తెలియదన్నారు.  కస్టడీలో తమని తప్పుదోవ పట్టించాడని పోలీసులు చెబుతున్నారు.  దీంతో మరో సెక్షన్‌ జోడించాలని పోలీసులు నిర్ణయించినట్లు సమాచారం.

కాగా, ఉదయ్‌ కృష్ణారెడ్డి కోర్టులో సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. పోలీస్ కస్టడీ ముగియడంతో అత్తాపూర్ పోలీసులు ఆయనను ఉప్పరపల్లి మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా కోర్టు హాలులోనే ఉదయ్‌ కృష్ణారెడ్డి బోరున విలపించారు. సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌పై ఆయన మేజిస్ట్రేట్‌కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. విచారణ పేరుతో తనను సీపీ సజ్జనార్ తీవ్రంగా బెదిరించారని, ‘నిన్ను ఎన్‌కౌంటర్‌ చేస్తాం’ అంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ ఉదయ్ ఆరోపించారు. అలాగే తన విచారణను వీడియో రికార్డింగ్‌ చేయలేదని.. తనను విచారించిన  గదిలో సీసీ కెమెరాలు లేవని తెలిపినట్టు సమాచారం.

ఉదయ్‌ కృష్ణారెడ్డి కస్టడీ శుక్రవారం సాయంత్రం ముగిసింది. రెండు రోజులపాటు పోలీసులు అత్తాపూర్‌ పోలీస్‌ స్టేషనన్‌లో  విచారించారు. ఉమెన్‌ సేఫ్టీ వింగ్‌ డీసీపీ లావణ్యతో పాటు కేసును విచారిస్తున్న ఇన్‌స్పెక్టర్‌ జోష్ణ, అత్తాపూర్‌ ఇన్‌స్పెక్టర్‌ సీతయ్య ఆధ్వర్యంలో విచారించారు. గురువారం రాత్రి హైదరాబాద్‌ కమీషనర్‌ సజ్జనార్‌ స్వయంగా వచ్చి దాదాపు మూడు గంటల పాటు విచారణలో పాల్గొన్నారు. విచారణ గడువు ముగియడంతో పోలీసులు మెజి్రస్టేట్‌ ముందు హాజరపరిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement