ట్యాంకర్‌ను ఢీకొట్టిన ట్రావెల్స్‌ బస్సు.. హైవేపై ట్రాఫిక్‌ జామ్‌ | Private Travels Bus And Tankar Accident At Jadcherla | Sakshi
Sakshi News home page

ట్యాంకర్‌ను ఢీకొట్టిన ట్రావెల్స్‌ బస్సు.. హైవేపై ట్రాఫిక్‌ జామ్‌

Nov 20 2025 7:42 AM | Updated on Nov 20 2025 7:46 AM

Private Travels Bus And Tankar Accident At Jadcherla

సాక్షి, మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. జడ్చర్ల మండలం మాచారం వద్ద 44వ జాతీయ రహదారిపై ట్యాంకర్‌, ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఎవరూ మృతి చెందకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

వివరాల ప్రకారం.. నేషనల్‌ హైవే-44పై మాచారం వద్ద ముందు వెళ్తున్న యాసిడ్‌ ట్యాంకర్‌ను జగన్‌ ట్రావెల్స్‌కు చెందిన బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదం కారణంగా ట్యాంకర్‌ నుంచి పొగలు బయటకు వచ్చాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పొగలను అదుపులోకి తీసుకువచ్చారు. దీంతో, పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన జరిగిన సమయంలో బస్సులో 26 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలిసింది. ట్రావెల్స్‌ బస్సు చిత్తూరు నుండి హైదరాబాద్‌కు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement