breaking news
tankar
-
పెళ్లి చేసుకోమంటే.. ట్యాంకర్ కిందకు తోసేసి..
నిజామాబాద్: మండలంలోని నెమలి గుట్ట తండాకు చెందిన బుక్య ప్రమీల(22)ను ఆమె ప్రియుడు హైదరాబాద్‌లోని బాచుపల్లిలో ఆదివారం ట్యాంకర్ కింద తోసేసి హత్య చేయడంతో తండాలో విషాదం నెలకొంది. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. ప్రమీల, మండలంలోని రోడ్డు బండ తండాకు చెందిన తిరుపతి కొద్ది రోజులుగా ప్రేమించుకుంటున్నారు. ప్రమీల బాచుపల్లిలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తోంది. తిరుపతి డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తనను పెళ్లి చేసుకోవాలని ప్రమీల తిరుపతిపై ఒత్తిడి తెచ్చింది. ఇద్దరు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ గొడవ పడ్డారు. అదే సమయంలో ఎదురుగా వస్తున్న వాటర్ ట్యాంకర్ కిందకు తిరుపతి ప్రమీలను తోసేయగా అక్కడికక్కడే మృతి చెందింది. తిరుపతి పరారీలో ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. -
ట్యాంకర్ పేలి వ్యక్తి దుర్మరణం
తాళ్లరేవు (ముమ్మిడివరం) : చెరువులకు ఆక్సిజ¯ŒS అందించేందుకు ఏర్పాటు చేసిన ఆక్వా గాలిమర ఒక వ్యక్తి ప్రాణం తీసింది. తాళ్లరేవు మండలం పటవల పంచాయతీలో జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న రొయ్యల చెరువు వద్ద ఎంఆర్ గ్లోబల్ అండ్ మెరై¯ŒS సర్వీసెస్ సంస్థ ఏర్పాటు చేసిన గాలిమరకు అమర్చిన ఆక్సిజ¯ŒS ట్యాంకర్ పేలిపోవడంతో అదే గ్రామానికి చెందిన ఆక్వా రైతు నరాల అప్పారావు (41) మృతి చెందారు. శుక్రవారం కోరంగి ఎస్సై బి.శ్రీనివాసరావు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పదేళ్లుగా చెరువులను సాగుచేస్తున్న అప్పారావు గురువారం రాత్రి చెరువులకు ఆక్సిజ¯ŒS సరఫరా చేసేందుకు గాలిమర స్విచ్ ఆ¯ŒS చేశాడు. గాలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఆక్సిజ¯ŒS ట్యాంకర్లో గాలి వత్తిడి ఎక్కువైంది. ప్రెజర్‌ను రెగ్యులేట్ చేయడానికి ట్యాంకర్ రిలీఫ్ వాల్వును ఓపె¯ŒS చేస్తుండగా ఒక్కసారిగా పెద్ద శబ్దంతో ట్యాంకర్ పేలడంతో దాని పై భాగాన ఉన్న ప్లేట్ ఎగిరి సుమారు 50 మీటర్ల దూరంలో పడింది. ఆ శబ్దం చాలా దూరం వరకు వినిపించినట్లు గ్రామస్తులు చెపుతున్నారు. కాగా ఈ ప్రెజర్‌కు అప్పారావు సైతం చెరువులో ఎగిరిపడ్డాడు. ప్లేట్ అప్పారావు మర్మాంగాలకు గట్టిగా తగలడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఆ వత్తిడికి అప్పారావు ఎడమకాలు నుజ్జునుజ్జు అయ్యింది. ఎస్సై బి.శ్రీనివాసరావు ఘటనా స్థలాన్ని సందర్శించి ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. అప్పారావుకు భార్య, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. పెద్ద కుమార్తెకు గతేడాది వివాహం చేశాడు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పలువురి పరామర్శ : మృతుని కుటుంబ సభ్యులను స్థానిక ఎంపీటీసీలు దంగేటి శ్రీనివాసరావు, దోణం ఆదిసత్యనారాయణ, ఎస్ఎంసీ కమిటీ చైర్మ¯ŒS టేకుమూడి లక్ష్మణరావు, మాజీ సర్పంచ్ కాలా సూరిబాబు, వైఎస్సార్సీపీ గ్రామకమిటీ కన్వీనర్ కాలా వెంకటరమణ, కొత్తూరు కాశీ తదితరులు పరామర్శించి ఓదార్చారు.