కిషన్‌ రెడ్డి పగటి కలలు కనడం మానుకోవాలి.. పొంగులేటి | Ponguleti Srinivasa Reddy key announcement regarding Rythu Bharosa | Sakshi
Sakshi News home page

కిషన్‌ రెడ్డి పగటి కలలు కనడం మానుకోవాలి.. పొంగులేటి

Jun 29 2026 5:52 PM | Updated on Jun 29 2026 6:36 PM

Ponguleti Srinivasa Reddy key announcement regarding Rythu Bharosa

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీజేపీ ఎప్పటికీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి జోస్యం చెప్పారు. కిషన్‌ రెడ్డి అధికారం కోసం పగటి కలలు కనడం మానుకోవాలని హితవుపలికారు. ఈ రోజు( సోమవారం) సాక్షితో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు.ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ను చంపే ప్రయత్నం చేస్తామని ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.కాంగ్రెస్‌ పార్టీకి, నాయకులకు కక్షపూరిత రాజకీయాలు తెలియవని అందుకే తమ నాయకులకు భద్రత సైతం తగ్గించామన్నారు. 

ఫారెస్ట్ ఏరియాల్లో ఒకప్పటి థ్రెట్ ఇప్పుడు లేదు అందుకే పలువురు నాయకులకు భద్రత తగ్గించామని తెలిపారు. దీపావళి బాంబుల వ్యాఖ్యలపై తాను ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని మనిషిని కొడితేనే బాంబ్ పడ్డట్టా సున్నితంగా కూడా బాంబులు వేయొచ్చు, మేము వేసిన బాంబులు కేటీఆర్ కు ఆల్రెడీ తగిలాయి. కేటీఆర్ ను అరెస్ట్ చేస్తేనే బాంబులు పేలినట్లు కాదు - ప్రజలు చి కొట్టినా బాంబ్ పడ్డట్లే అన్నారు.

ఇందిరమ్మ ఇండ్ల స్లాబ్ లెన్త్ పెంపుపై స్పందిస్తూ మేస్త్రి లాభం కోసం ఇల్లుకు నాలుగు వైపులా పెంచుతున్నారు. స్లాబ్ పెంచడం వల్ల లబ్ధిదారులకె నష్టం.గ్రేటర్ సిటిలో పది అంతస్తుల్లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు.రెండు ఎకరాల్లో 8 టవర్లు నిర్మించే ఆలోచనలో ఉంది.సిటిలో 23 స్థలాలు- 18 నియోజకవర్గల్లో వచ్చేలా ఫస్ట్ ఫెజ్ నిర్మాణం ఉంటుంది. వచ్చే కేబినెట్ లో ఆమోదం లభించే అవకాశం ఉంది. నవంబర్ లో GHMC ఎన్నికలు అనే చర్చ ఇప్పటికి లేదని  మంత్రి చిట్‌చాట్‌లో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement