సాక్షి, హైదరాబాద్: నేపాల్ వరదల్లో చిక్కుకున్న తెలంగాణ వాసుల కోసం ప్రభుత్వం ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసింది. నేపాల్ పరిస్థితులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తెలంగాణ వాసులకు అవసరమైన సహాయం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాలతో తెలంగాణ భవన్‌లో ప్రత్యేక సమన్వయ కేంద్రం ఏర్పాటు చేశారు.
MEA, ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయంతో తెలంగాణ భవన్ అధికారుల సమన్వయం చేసుకుంటున్నారు. నేపాల్‌లో ఉన్న తెలంగాణ యాత్రికులు, పర్యాటకుల కుటుంబ సభ్యులు హెల్ప్‌లైన్‌ను సంప్రదించవచ్చు. బాధితుల పేరు, పాస్‌పోర్ట్, మొబైల్, నేపాల్‌లోని ప్రాంత వివరాలు అందించాలని తెలంగాణ ప్రభుత్వం సూచించింది. ట్రావెల్/టూర్ ఆపరేటర్, కుటుంబ సభ్యుల సంప్రదింపు వివరాలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం సూచించింది. అందిన విజ్ఞప్తులను ప్రాధాన్యతా ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వానికి, భారత రాయబార కార్యాలయానికి చేరవేయనుంది. తెలంగాణ భవన్ హెల్ప్‌లైన్ నంబర్లు: 9871999044, 9949351270, 9618597969.


