రాహుల్‌ గాంధీకి బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి లేఖ | Bjp Leader Maheshwar Reddy Letter To Rahul Gandhi | Sakshi
Sakshi News home page

రాహుల్‌ గాంధీకి బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి లేఖ

Aug 26 2026 8:28 PM | Updated on Aug 26 2026 8:39 PM

Bjp Leader Maheshwar Reddy Letter To Rahul Gandhi

సాక్షి, హైదరాబాద్‌: నిషేధిత భూముల అంశంపై ఎందుకు స్పందించడం లేదంటూ రాహుల్‌ గాంధీకి బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. 22ఏ నిషేధిత జాబితాపై కుట్ర చేసిందెవరో తేల్చాలి. 22ఏ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న భూదందాపై నెలరోజులుగా బీజేపీ పోరాటం చేస్తుంది. ఆధారాలతో అసెంబ్లీకి నేను చర్చకు వస్తే రాకుండా మంత్రి పారిపోయారు. నిషేధిత జాబితాలో ఉన్న భూముల వివరాలపై శ్వేత పత్రం విడుదల చేయాలి’’ అని ఏలేటి డిమాండ్‌ చేశారు.  

కుట్ర చేసి నిషేధిత జాబితాలో భూములు పెడితే విచారణ జరపాలి. సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐ లేదా హౌజ్ కమిటీ వేస్తారా స్పష్టం చేయాలి. భూ భారతి మంత్రులకు నగల, వజ్రాల హారంగా మారింది. కాంగ్రెస్ 33 నెలల పాలనలో భూ భారతి అతిపెద్ద కుంభకోణం. సీఎం రేవంత్ చెప్పిన అసలు కుట్ర ఆయన కేబినెట్‌లోనే జరుగుతుంది. 22A బాధితులకు న్యాయం చేయాలి. కారకులైన అధికారులపై చర్యలు తీసుకోవాలి. బాధ్యులపై క్రిమినల్ కేసులు కూడా పెట్టాలి. 22A అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరపాలి. అంతేకాదు సీబీఐ విచారణ కోరుతూ ప్రభుత్వం లేఖ రాయాలి. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజీనామా చేయాలి’’ అంటూ మహేశ్వర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement