మం‍త్రి పువ్వాడ అజయ్‌కు కరోనా.. | Minister Puvvada Ajay Kumar Tested Corona Positive | Sakshi
Sakshi News home page

మం‍త్రి పువ్వాడ అజయ్‌కు కరోనా..

Dec 15 2020 9:57 AM | Updated on Dec 15 2020 10:09 AM

Minister Puvvada Ajay Kumar Tested Corona Positive - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా మంగళవారం ట్విటర్‌లో వెల్లడించారు. ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపారు. ఇటీవల కాలంలో ఆయనను కలిసిన వారు ఐసోలేషన్‌కు వెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రస్తుతం అయన ఆరోగ్యం బాగానే ఉందని స్వల్ప కరోనా లక్షణాలు ఉన్నట్లు మంత్రి ట్వీటర్‌లో పేర్కొన్నారు.

కాగా, గడిచిన 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 491 కరోనా కేసులు నమోదు కాగా.. ముగ్గురు మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసులు 2,78,599 సంఖ్యకు చేరుకున్నాయి. ఇప్పటి వరకు 2,69,828 మంది డిశ్చార్జ్ కాగా.. 1,499 మంది మృతి చెందారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో 7,272 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆరోగ్య శాఖ తాజా నివేధికలో వెల్లడించింది.

Advertisement
 
Advertisement
Advertisement