అమ్మా! వద్దు.. వద్దంటున్నా.. | married women suicide in Godavarikhani | Sakshi
Sakshi News home page

అమ్మా! వద్దు.. వద్దంటున్నా..

Sep 9 2024 9:18 AM | Updated on Sep 9 2024 12:44 PM

married women suicide in Godavarikhani

గోదావరిఖని: ‘అమ్మా.. వద్దు వద్దు! నువ్వు ఏం జేస్తున్నవో నాకు తెలుస్తలేదు.. ఆ పని చేయొద్దమ్మా.. నాకు భయమేస్తుంది అమ్మా!’అని కూతురు వారిస్తున్నా వినకుండా ఓ వివాహిత, ఓ వ్యక్తితో వీడియోకాల్‌లో మాట్లాడుతూనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో శనివారం ఈ ఘటన జరిగింది.

పోలీసుల కథనం ప్రకారం.. పెద్దపల్లి మండలం మూలసాల గ్రామానికి చెందిన చొప్పరి అంజయ్య, మాధవి భార్యాభర్తలు. ఉపాధి కోసం వారు పదేళ్ల క్రితం గోదావరిఖని విఠల్‌నగర్‌కు వలస వచ్చారు. అంజయ్య సెంట్రింగ్‌ పనులు చేస్తున్నాడు. వీరికి ఏడేళ్ల వయసున్న రితిక అనే కూతురు ఉంది. తిలక్‌నగర్‌కు చెందిన సింగరేణి ఉద్యోగి ఎండీ యూసుఫ్‌ కుటుంబసభ్యులతో అంజయ్య, మాధవి కుటుంబానికి ఎనిమిదేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది.

ఈ క్రమంలో యూసుఫ్‌ తరచూ వీరి ఇంటికి వచ్చివెళ్లేవాడు. మాధవి, యూసుఫ్‌ ఫోన్‌లో కూడా మాట్లాడుకునేవారు. అంజయ్య శనివారం ఉదయం సెంట్రింగ్‌ పనులు చేసేందుకు గోదావరిఖని సమీపంలోని సుందిళ్ల గ్రామానికి వెళ్లాడు. ఏం జరిగిందో ఏమోకానీ.. యూసుఫ్‌తో వీడియోకాల్‌లో మాట్లాడుతూనే ఉదయం 10 గంటల సమయంలో మాధవి (30) ఉరివేసుకుంది. ఉరివేసుకుంటుండగా పక్కనే ఉన్న ఆమె కూతురు అమ్మా వద్దు వద్దు.. అని వారించినా వినలేదు. తన భార్య మరణం విషయంలో యూసుఫ్‌పై అనుమానంగా ఉందని మృతురాలి భర్త అంజయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమేశ్‌ తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement