
బస్తీఫైట్‌కు దిగిన యువకులు
గోదావరిఖని: సిగరేట్ తాగాలనే తాపత్రయం ఠా ణా మెట్లెక్కించింది. ఇరువర్గాలు రోడ్డుపై కొట్టుకో వడం భయాందోళనకు గురిచేసింది. పోలీసులు రంగప్రవేశం చేసి 8మందిపై కేసు నమోదు చేశారు. గోదావరిఖనిలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. వన్‌టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి కథనం ప్రకారం.. ఇద్దరు మిత్రులు సిగరెట్ కోసం రాజేశ్ థియేటర్ సమీపంలోని ఓ పాన్‌షాప్ వద్దకు వెళ్లారు. మూడు సిగరెట్లకు డబ్బులు చెల్లించగా రెండు సిగరెట్లే ఇచ్చావని షాపు నిర్వాహకుడిని ప్రశ్నించారు.
ఈక్రమంలో ఇరువర్గాల మద్య మాటామాట పెరిగింది. కొట్టు కట్టేసే సమయం అయిపోయిందని, పక్కకు వెళ్లి సిగరెట్ తాగాలని షాపు యాజమాని సూచించాడు. దీంతో ఆయనపై ఇద్దరు మిత్రలు చేయి చేసుకున్నారు. ఈక్రమంలో బాధితుడు తన బందువులకు ఫోన్‌చేసి ముగ్గురిని పిలిపించాడు. సిగరెట్ కోసం వచ్చిన ఇద్దరు యువకులు కూడా ఫోన్‌చేసి మరో ఇద్దరిని పిలిపించుకున్నారు. దీంతో ఇరువర్గాలకు చెందిన 8 మంది నడిరోడ్డుపై కొట్టుకోవడంతో అక్కడ భీతావహ పరిస్థితి తలెత్తింది.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఒకవర్గానికి చెందిన కె.ప్రణయ్‌కౌశిక్, మహ్మద్ ఆజీం, బి.ఆదర్శ్, టి.రాహుల్, మరో వర్గానికి చెందిన ఎం.శ్యాంసుందర్, ఎం.అభిలాష్, జి.రాజ్‌కుమార్, సీహెచ్ చంద్రమౌళిగా గుర్తించారు. నడిరోడ్డుపై గొడవకు దిగి శాంతిభద్రతలకు భంగం కలిగించిన నిందితులపై కేసునమోదు చేసినట్లు సీఐ తెలిపారు. సిగరేట్ కోసం ఠాణా మెట్లు ఎక్కి కేసులో ఇరుక్కోవడం నగరంలో చర్చనీయాంశమైంది.