సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం వదిలి గోలిసోడా కంపెనీ.. కోట్ల టర్నోవర్‌.. నెలకు లక్షల్లో సంపాదన

Man Leaves IT Job To Sell Goli Soda Earns Lakhs Per Month Read Story - Sakshi

గోలి సోడా.. ఈ పేరు తెలియని వారు ఉండరు. ఒకప్పుడు ఎక్కడ చూసినా ఇదే కనిపించేది.. దాహర్తిని తీర్చుకునేందుకు ఎక్కువగా గోలిసోడానే ఎంచుకునేవారు. ఎండకాలంలో దీనికి డిమాండ్‌ మరీనూ. బస్టాండ్లు, రోడ్డు పక్కన బండిలో… ఇలా ఎక్కడ పడితే అక్కడ గోలీసోడా కనిపించేది. కానీ కాలక్రమేనా గోలిసోడా వినియోగం తగ్గింది. ఎక్కడైనా చుద్దామన్నా సరిగా కనిపించడం లేదు. 

తాజాగా ఓ యువకుడు గోలిసోడా అమ్మేందుకు హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉ ఉద్యోగాన్ని వదిలేశాడు. వినడానికి కొంచెం విడ్డూరంగా ఉన్నా ఇదే నిజం.. అసలు వార్తలోకి వెళితే.. కరీంనగర్‌ జిల్లాకు చెందిన తుల రంగనాథ్‌కు ఐటీ సెక్టార్‌లో ఉద్యోగం. మంచి జీతం. కానీ అవేవి అతనికి సంతృప్తి నివ్వలేదు. దీంతో సొంతంగా వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఏ వ్యాపారం చేయాలనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ క్రమంలో దాదాపు 20 ఏళ్ల కిత్రం తను చిన్న తనంలో కరీంనగర్‌లో గోలిసోడా తయారు చేసే వ్యక్తులను చూసినట్లు అతనికి గుర్తొచ్చింది.

తమ ప్రాంతంలో ప్రస్తుతం గోలిసోడాను తయారు చేసేందుకు ఎవరూ ఆస్తి చూపడం లేదని తెలుసుకున్నాడు. దీంతో తను పుట్టి పెరిగిన ప్రాంతంలో గోలిసోడాను తయారు చేసే బాధ్యతను తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇంకేముందే అనుకుందే తడవుగా గోలిసోడా అమ్మేందుకు సిద్ధపపడ్డాడు. ముందుగా తన బిజినెస్‌ ఐడియాను తల్లిదండ్రులకు వివరించగా వారు అంగీకరించలేదు. అయినా పట్టువదలకుండా ప్రయత్నించి తల్లిదండ్రులను ఒప్పించాడు. 
చదవండి: ఆర్డినెన్స్‌ వివాదం.. ఆప్‌కు షాక్‌ ఇవ్వనున్న కాంగ్రెస్‌?

ఇక ఈ పని చేయడం అంత సులువు కాదని తెలుసు. దీని గురించి పలువురి దగ్గర పూర్తి తెలుసుకున్నాడు. గోలిసోడా ఆలోచన తట్టిన సమయంలో రంగనాథ్‌కు ఇంకా పెళ్లి కాలేదు. ఒకవేళ ఈ వ్యాపారంలో ఫెయిల్‌ అయితే పెళ్లి సంబంధాలు కూడా రావని అతనికి తెలుసు అయినా తనమీద తనకున్న నమ్మకంతో 2020లో తన ఉద్యోగానికి రాజీనామా చేసి రూ. 30 లక్షలు పెట్టుబడితో గోలిసోడా కంపెనీని ప్రారంభించాడు. ఈ డబ్బును తెలిసిన వ్యక్తుల వద్ద వడ్డీ చొప్పున అప్పు చేసి మరీ తీసుకొచ్చాడు. 

కొంత భూమిని లీజుకు తీసుకొని అక్కడ గోలి సోడా ఫ్లాంట్‌ను నిర్మించి బిజినెస్‌ను స్టార్ట్ చేశాడు. గోలిసోడాపై అతని కృషి, అభిరుచి రంగనాథ్‌కు మంచి ఫలితాన్ని ఇచ్చింది. అది రాను రాను నాలుగు కోట్ల టర్నోవర్‌కు చేరింది. అంతేగాక దాదాపు 100 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. కరీంనగర్ జిల్లాలో కాకుండా పక్క జిల్లాలలో కూడా ఈ గోలి సోడాలను బేకరీలకు, కిరాణా షాపులకు అందిస్తున్నామని నిర్వాహకుడు రంగనాత్‌ తెలిపారు. మొదట్లో ప్లాంటు కొంచెం ఇబ్బంది అయినా కూడా తర్వాత మెల్లమెల్లగా ప్లాంటును పెద్ద ఎత్తున విస్తరించామని రఘు అంటున్నాడు.
చదవండి: అవమానానికి గుణపాఠం.. తలపాగా రంగుకు తగ్గ రోల్స్ రాయిస్

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top