
సాక్షి, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. వివాహిత మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ క్రమంలో ఇద్దరు కలిసి ఉన్న సమయంలో సదరు మహిళ భర్త వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. అనంతరం, కుటుంబ సభ్యులు, స్థానికులు వారిద్దరినీ స్థంభానికి కట్టేసి దేహశుద్ది చేశారు.
వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లాలోని తిరుమలగిరి (సాగర్) మండలం నాయకుని తండాలో వివాహిత, రమేష్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ గమనించిన సదరు మహిళ భర్త.. వారిద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. అనంతరం, సదరు భర్త స్థానికుల సాయంతో.. విద్యుత్ స్తంభానికి కట్టేసి ఇద్దరికీ దేహశుద్ధి చేశారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. అయితే, శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
