Lightning Bolt: విద్యుత్‌ స్తంభంపై పిడుగుపాటు.. | Lighting Bolt Effect On Electric Pole In Adilabad | Sakshi
Sakshi News home page

Lightning Bolt: విద్యుత్‌ స్తంభంపై పిడుగుపాటు..

Aug 26 2021 7:49 AM | Updated on Aug 26 2021 1:55 PM

Lighting Bolt Effect On Electric Pole In Adilabad - Sakshi

సాక్షి, ఉట్నూర్‌(ఆదిలాబాద్‌): మండలంలోని ఎక్స్‌రోడ్డు లింగోజీ తండాలో విద్యుత్‌ స్తంభంపై బుధవారం పిడుగుపడింది. మధ్యాహ్నం కురిసిన భారీ వర్షానికి స్తంభంపై పిడుగు పడడంతో ఎర్తింగ్‌ వైర్‌ తెగిందని సర్పంచ్‌ హరినాయక్‌ పేర్కొన్నారు. 

నెట్‌వర్క్‌ లేక ఏఎన్‌ఎంల పాట్లు
నార్నూర్‌(గాదిగూడ): గ్రామీణ ప్రాంతంలో మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతోపాటు, గర్భిణి, బాలింతల మరణాలు తగ్గించడానికి ప్రభుత్వం ఏఎన్‌ఎంలు, హెల్త్‌ అసిస్టెంట్లకు ట్యాప్‌లు అందజేసింది. ప్రతిరోజు ఫీల్డ్‌ వెళ్లి వివరాలు నమోదు చేయాల్సి ఉంటోంది. మంగళవారం గాదిగూడ మండలంలో నెట్‌వర్క్‌ సౌకర్యం లేక ఏఎన్‌ఎంలు పడరాని పాట్లు పడ్డారు. ఝరి పీహెచ్‌సీ ఏఎన్‌ఎంలు గుట్ట ఎత్తు ప్రాంతానికి వెళ్లి వివరాలు నమోదు చేశారు. వైద్యాధికారి పవన్‌కుమార్‌.. ఆస్పత్రి భవనం ఎక్కి సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ కనిపించారు.  

చదవండి: Andhra Pradesh: ఉధృతి తగ్గినా.. జాగ్రత్త 

Advertisement
 
Advertisement
Advertisement