Gachibowli: విదేశీ యువతులతో వ్యభిచారం | Illegal Activities In Gachibowli, 9 Young Women Were Detained | Sakshi
Sakshi News home page

Gachibowli: విదేశీ యువతులతో వ్యభిచారం

Jan 29 2025 8:21 AM | Updated on Jan 29 2025 9:39 AM

illegal activities in Gachibowli

గచ్చిబౌలి: విదేశీ యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టురట్టయ్యింది. మంగళవారం రాత్రి టీఎన్‌జీవోస్‌ కాలనీలోని ఓ ఇంట్లో గచ్చిబౌలి పోలీసులు, ఎస్‌ఓటీ పోలీసులు దాడి చేశారు. ఒక విటుడు, 9 మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు. టాంజానియా, కజికిస్తాన్‌కు చెందిన యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో పోలీసులు దాడులు చేశారు. నిర్వాహకులు పరారైనట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement