పరేడ్‌ గ్రౌండ్స్‌లో యోగా మహోత్సవ్‌

Hyderabad: Yoga Mahotsav Started On May 27 At Parade Grounds - Sakshi

రసూల్‌పురా(హైదరాబాద్‌): భారతీయ వారసత్వ సంపద యోగా అని.. ఇస్లామిక్, క్రిస్టియన్‌ అనే భేదాలు, భాషలు, ప్రాంతాల తేడా లేకుండా ప్రపంచమంతా యోగాను అనుసరిస్తున్నాయని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి చెప్పారు. ప్రపంచ యోగా దినోత్సవమైన జూన్‌ 21కి 25 రోజుల కౌంట్‌డౌన్‌గా శనివారం సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో యోగా మహోత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. కేంద్ర ఆయుష్‌ శాఖ ఆధ్వర్యంలోని మొరార్జీ దేశాయ్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ యోగా నేతృత్వంలో చేపడుతున్న ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను శుక్రవారం కేంద్ర ఆయుష్‌ మంత్రి శర్వానంద సోనోవాల్, కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి ముంజ్‌పరా మహేంద్రభాయ్‌ కాళూభాయ్‌లతో కలసి కిషన్‌రెడ్డి పరిశీలించారు.

అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడారు. ఈ యోగా మహోత్సవ్‌కు గవర్నర్‌ తమిళిసై ముఖ్య అతిథిగా హజరవుతున్నారని కిషన్‌రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిని కూడా ఆహా్వనించామని చెప్పారు. ప్రధాని మోదీ ఆదేశాల మేరకు ప్రపంచ యోగా దినోత్సవానికి కౌంట్‌డౌన్‌గా యోగా మహోత్సవ్‌లు నిర్వహిస్తున్నామని వివరించారు. 75 రోజు ల కౌంట్‌డౌన్‌ను అసోంలో, 50 రోజుల కౌంట్‌డౌన్‌ జైపూర్‌లో నిర్వహించామని చెప్పారు. పరేడ్‌ గ్రౌండ్స్‌లో జరిగే యోగా మహోత్సవ్‌లో కేంద్ర ప్రభుత్వ సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు, కళాకారులు, వేలమంది యోగా గురువులు, సినీ ఆరి్టస్టులు, రాష్ట్ర మంత్రులు పాల్గొననున్నట్టు తెలిపారు. 

ఆర్కిటిక్‌ నుంచి అంటార్కిటికా దాకా: సోనోవాల్‌ 
ఈసారి ప్రపంచ యోగా దినోత్సవ నినాదం ‘వసుదైక కుటుంబం కోసం యోగా’అని కేంద్ర మంత్రి శర్వానంద సోనోవాల్‌ తెలిపారు. ప్రధాని మోదీ కృషి కారణంగా ప్రపంచం మొత్తం యోగాను సంపూర్ణ ఆరోగ్యానికి మార్గదర్శిగా అంగీకరించిందని చెప్పారు. మూడు శాఖల సాయంతో ఓడరేవుల్లో నౌకలతో ‘ఓషన్‌ రింగ్‌ ఆఫ్‌ యోగా’ను నిర్వహించనున్నామని.. ఆర్కిటిక్‌ నుంచి అంటార్కిటికా వరకు ఉత్తర, దక్షిణ ధ్రువ ప్రాంతాల్లో ఈ యోగా ప్రదర్శన జరుగుతుందని తెలిపారు. ఆర్కిటిక్‌లోని స్వా ల్బార్డ్‌ భారత పరిశోధన స్థావరం, హిమాద్రి, అంటార్కిటికాలోని మూడో భారత పరిశోధన స్థావరం, ఐఎన్‌ఎస్‌ విక్రాంత్, ఐఎన్‌ఎస్‌ విక్రమాదిత్య ఫ్లైట్‌ డెక్‌లపై యోగా ప్రదర్శన ఉంటుందన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top