మూగ జీవుల ‘మనసు’ తెలుసుకునేలా.. | Hyderabad scientists develop bio-score | Sakshi
Sakshi News home page

మూగ జీవుల ‘మనసు’ తెలుసుకునేలా..

Jun 21 2026 1:48 AM | Updated on Jun 21 2026 1:48 AM

Hyderabad scientists develop bio-score

బయోస్కోర్‌...మానసిక ఆరోగ్యపరీక్ష  

రక్తపరీక్ష అక్కర్లేదు... మలపరీక్షతో మానసిక స్థితి గుర్తింపు 

బయోస్కోర్‌ను ఆవిష్కరించిన సీసీఎంబీ శాస్త్రవేత్తలు

సాక్షి, హైదరాబాద్‌: మానసిక ఒత్తిడి మనుషులకే కాదు, మూగజీవులకూ ఉంటుంది. మరి వాటి మానసిక ఒత్తిడిని గ్రహించేదెలా? హైదరాబాద్, సీసీఎంబీ(సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులార్‌ బయాలజీ)లోని అంతరించిపోతున్న జాతుల పరిక్షణ ప్రయోగశాల (లాకోన్స్‌) శాస్త్రవేత్తలు జంతువుల మనసును చదవడానికి ‘బయో–స్కోర్‌’విధానాన్ని అభివృద్ధి చేశారు. 

మలపరీక్ష చాలు! 
సాధారణంగా జంతువుల అనారోగ్యాన్ని గుర్తించడానికి రక్తపరీక్ష చేస్తారు. రక్తం సేకరించే క్రమంలో అవి మరింత ఒత్తిడికి గురవుతాయి. బయో–స్కోరింగ్‌ విధానంలో జంతువుల మలాన్ని పరీక్ష చేస్తారు. దీనిని ‘ఫీకల్‌ గ్లూకోకార్టికాయిడ్‌ మెటాబోలైట్‌’(ఎఫ్‌జీఎం) విశ్లేషణ అంటారు. ఈ పరీక్ష ద్వారా జంతువుల్లోని హార్మోన్ల హెచ్చుతగ్గులను పరిశీలించి, అవి కొన్ని రోజులు, వారాలుగా అనుభవిస్తున్న ఒత్తిడిని కచి్చతంగా నిర్ధారిస్తారు. 

బోనులోని సింహానికీ తప్పని ఒత్తిడి 
జంతుప్రదర్శనశాలల్లోని బోనుల్లో ఉండే పులులు, సింహాల వంటి వన్యప్రాణులు పైకి ఎంత గంభీరంగా, ఆరోగ్యంగా కనిపిస్తున్నప్పటికీ మానసికంగా తీవ్రమైన ఒత్తిడిని అనుభవిస్తుంటాయి. జూ నిర్వహకులు జంతువుల శారీరక లక్షణాలు, ప్రవర్తన ఆధారంగా ఇచ్చే ‘కేర్‌ ఇన్‌ క్యాప్టివిటీ’స్కోర్‌కార్డులు కచ్చితమైన ఆరోగ్యస్థితిని అంచనా వేయలేవని గుర్తించిన శాస్త్రవ్తేలు ఈ బయో–స్కోర్‌ విధానాన్ని అభివృద్ధి చేశారు. 

భవిష్యత్తు సమస్యలకు అద్దం 
జూలలో జంతువు చురుగ్గా తిరుగుతోందా, బక్కచిక్కిందా, ఆహారం సరిగ్గా తింటోందా వంటి పైకి కనిపించే విషయాల ఆధారంగా రిపోర్టు ఇస్తారు. బయో స్కోర్‌ డేటా ద్వారా జంతువుల ప్రస్తుత ఆరోగ్య స్థితితోపాటు భవిష్యత్తు ఆరోగ్యాన్ని కూడా గ్రహించవచ్చు. తీవ్రమైన ఒత్తిడి వల్ల సంతానోత్పత్తి సామర్థ్యం దెబ్బతినడం వంటి పరిణామాలను గ్రహించి, తగిన జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement