పబ్‌లో ఘర్షణ.. బౌన్సర్లకు గాయాలు | Hyderabad Kondapur pub fight leaves three bouncers injured | Sakshi
Sakshi News home page

పబ్‌లో ఘర్షణ.. బౌన్సర్లకు గాయాలు

Sep 24 2025 11:59 AM | Updated on Sep 24 2025 11:59 AM

Hyderabad Kondapur pub fight leaves three bouncers injured

హైదరబాద్‌: మాదాపూర్‌లోని మ్యాడ్‌ పబ్‌లో కొంతమంది అతిగా మద్యం తాగి, బిల్లు ఎక్కువగా వచ్చిందని పబ్‌ సిబ్బందితో గొడవ పడ్డారు. బిల్లు తగ్గించాలని వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలోనే మద్యం మత్తులో ఉన్న వ్యక్తులు అక్కడున్న సిబ్బంది, బౌన్సర్లపై ఖాళీ సీసాలు, చేతికి అందిన వస్తువులతో దాడి చేశారు. దీంతో బౌన్సర్లకు తీవ్ర గాయాలవగా..కొండాపూర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. ఈ ఘటన శనివారం అర్థరాత్రి చోటు చేసుకుంది. విషయం ఆలస్యంగా వెలుగులోకి వచి్చంది. పబ్‌ ఓనర్‌ ప్రశాంత్‌ మాదాపూర్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

 

 

Advertisement
 
Advertisement
Advertisement