వ్యవసాయ భూమిలో ఫామ్‌ హౌస్‌ లేదు: హరీశ్‌రావు | Harish Rao Land Dispute Challenge Congress MPs Telangana | Sakshi
Sakshi News home page

వ్యవసాయ భూమిలో ఫామ్‌ హౌస్‌ లేదు: హరీశ్‌రావు

Sep 19 2026 7:58 AM | Updated on Sep 19 2026 7:58 AM

Harish Rao Land Dispute Challenge Congress MPs Telangana

నా భూమి కొనుగోలులో చిన్నతప్పు జరిగిందని నిరూపిస్తే ప్రభుత్వానికే వదిలేస్తా

కేసీఆర్‌ 300ఎకరాలు కబ్జా చేయలేదని తేలితే సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారా?

సవాల్‌ చేస్తున్నా..  కబ్జా చేసినట్లు తేలితే మేమంతా రాజీనామా చేస్తాం

సాక్షి, తెలంగాణ: వ్యవసాయ భూమిలో ఫామ్‌ హౌస్‌ లేదని, కనీసం అందులో బాత్రూం కూడా లేదని, తనకు ఉన్న ఆస్తులన్నీ ప్రతి ఎన్నికల్లో పొందుపరిచే అఫిడవిట్‌లలో తెలిపానని బీఆర్‌ఎస్‌ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ హరీశ్‌రావు స్పష్టం చేశారు. రంగనాయకసాగర్‌ రిజర్వాయర్‌ కోసం రైతులకు నవంబర్‌ 2016 పరిహారంను ప్రభుత్వం చెల్లించిందని, జూన్‌ 2018లో రిజర్వాయర్‌ పూర్తి అయిందని, ఆగస్టు 2018–2024 వరకు 11 డాక్యుమెంట్లలో 13 ఎకరాల భూమిని కొనుగోలు చేశానన్నారు.

తన భూమి కొనుగోలులో ఒక్క చిన్న తప్పు ఉందని నిరూపించినా మొత్తం భూమి ని ప్రభుత్వానికే వదిలేస్తానని హరీశ్‌ ప్రకటించారు. శుక్రవారం కాంగ్రెస్‌ ఎంపీల పర్యటించిన నేపథ్యంలో సిద్దిపేటలోని క్యాంప్‌ కార్యాలయంలో «ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం డెవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తోందని, అందులో భాగమే తన వ్యవసాయ భూమి వద్దకు కాంగ్రెస్‌ ఎంపీల పర్య టన అని మండిపడ్డారు.

సీఎం తమ్ముళ్ల, మంత్రి పొంగులేటి, ఆయన కొడుకు చేస్తున్న భూ దందాలను బీఆర్‌ఎస్‌ ఎండగట్టినందుకే తమపై ఎదురుదాడి చేస్తున్నారన్నారు. ఎంపీల బృందం వస్తే కడు పు నిండా భోజనం పెట్టి తీసుకువెళ్లి వ్యవసాయ క్షేత్రంను చూపిద్దామనుకున్నాని హరీశ్‌ చెప్పారు.

ప్రభుత్వంలో ఉండి యాత్రలా?
ప్రభుత్వాలు వాస్తవాలను దాచిపెట్టినప్పుడు ప్రతిపక్షాలు యాత్రలు చేసి నిజనిర్ధారణకు వెళ్తాయి కానీ అధికారంలో ఉండి ప్రభుత్వమే యాత్రలకు రావడం శోచనీయమన్నారు.కేసీఆర్‌ హయాంలో కాళేశ్వరంతో పాటు ఏడు ప్రాజెక్టులకు అనుమతులు రాగా...ఇప్పుడు ఆ ప్రాజెక్టుల అనుమతులను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం జీఆర్‌ఎంబీ ఎజెండాలో పెట్టిందన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ అక్రమంగా ప్రాజెక్టులు కడుతూ గోదావరి నీళ్లను ఎత్తుకుపోవాలని చూస్తుంటే కేంద్రంపై కాంగ్రెస్‌ ఎంపీలు దండయాత్ర చేయాలన్నారు. మెట్రో ఫేజ్‌–2కు, పాలమూరు ఎత్తిపోతల, సీతమ్మ సాగర్‌ ప్రాజెక్టులకు కేంద్రం అనుమతులు ఇవ్వడం లేదని, వీటి సాధన కోసం, రాష్ట్ర హక్కుల కోసం కలిసికట్టుగా కేంద్రంపై పోరాడాలి కానీ.. రాజకీయ కక్షసాధింపుల కోసం యాత్రలు చేయకూడద న్నారు.

దళితులకు చెందిన 300 ఎకరాల భూమిని కేసీఆర్‌ కబ్జా చేయలేదని తేలితే సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారా ? అని హరీశ్‌ సవాల్‌ విసిరారు. దళితుల భూమి కబ్జా చేసినట్లు తేలితే తామంతా రాజీనామా చేస్తామని, ఇందుకు మీరంతా సిద్ధమా? అని సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలకు హరీశ్‌రావు సవాల్‌ చేశారు.

ఇదీ చదవండి: ఎల్‌నినోపై సమగ్ర వ్యూహం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement